|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజాసాబ్: ‘రాజాసాబ్’ షూటింగ్ సెట్ నుంచి ఫోటో వైరల్.. రెబెల్ స్టార్ ఏం నవ్వుతున్నాడ్రా బాబు..

Published: 13-06-2025, 9:54 AM
రాజాసాబ్: ‘రాజాసాబ్’ షూటింగ్ సెట్ నుంచి ఫోటో వైరల్.. రెబెల్ స్టార్ ఏం నవ్వుతున్నాడ్రా బాబు..

ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా షూటింగ్ సెట్ నుండి ఒక ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ప్రభాస్, దర్శకుడు మారుతి, సంగీత దర్శకుడు థమన్ సరదాగా కనిపిస్తున్నారు. టీజర్ జూన్ 16న విడుదల కానుంది.

Key Points

1

ప్రభాస్ ‘రాజాసాబ్’ షూటింగ్ సెట్ నుండి ఫోటో వైరల్ అయ్యింది.

2

ప్రభాస్, మారుతి, థమన్ సరదాగా నవ్వుతూ కనిపించారు.

4

సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.

‘రాజాసాబ్’ షూటింగ్ సెట్ ఫోటో వైరల్

Raja Saab : ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో రాజాసాబ్ అనే సినిమాతో రాబోతున్నాడు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ సినిమా చేస్తుండటం, తాత గెటప్ లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఇటీవలే టీజర్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ప్రభాస్ రాజాసాబ్ టీజర్ జూన్ 16 ఉదయం 10.52 గంటలకు రిలీజ్ అవ్వనుంది. దీంతో ఫ్యాన్స్ అంతా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ సూపర్ ఫోటో రిలీజ్ చేసారు. ప్రభాస్, డైరెక్టర్ మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సెట్లో కూర్చొని సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. రెబల్ స్టార్ కూడా ఫుల్ గా నవ్వుతుండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రభాస్, మారుతి, థమన్ సరదా క్షణాలు

జూన్ 16న టీజర్, డిసెంబర్ 5న సినిమా విడుదల

ప్రభాస్ రాజాసాబ్ సినిమా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతుండగా ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

ప్రభాస్ అభిమానులు ఈ ఫోటోను బాగా ఆహ్వానించారు. రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న విడుదల కానున్నందున ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.