
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న SSMB29 సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రీ-లుక్ విడుదలైంది.
Key Points
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే SSMB29 సినిమా నుంచి ప్రీ-లుక్ రిలీజ్.
మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన పోస్టర్ విడుదల.
పోస్టర్లో మహేశ్ బాబు ఇంటెన్స్ లుక్, శివుడి త్రిశూలం లాకెట్ ఆకట్టుకుంటుంది.
సినిమా పూర్తి వివరాలు నవంబర్ 2025లో వెల్లడించనున్నట్లు ప్రకటన.
SSMB29 నుంచి మహేశ్ బాబు ప్రీ-లుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు అప్‌కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి.
మహేశ్ బాబు పుట్టినరోజు ఇవాళ (ఆగస్ట్ 9). మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు జక్కన్న. ఎస్ఎస్ఎంబీ 29లోని మహేశ్ బాబు ప్రీ లుక్ పోస్టర్‌ను రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అంతేకాకుండా దానికి జక్కన్న రాసుకొచ్చిన నోట్ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
ఈ లుక్‌లో మహేశ్ బాబు ఛాతి మీద శివుడి త్రిశూలం, నామం, ఆయన వాహనం అయిన నంది విగ్రహంతో ఉన్న లాకెట్ ఉంది. అలాగే, మహేశ్ బాబు రక్తపు మరకలు ఉన్న లో కట్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఈ లుక్ చాలా ఇంటెన్సిటీగా ఉంది.
రాజమౌళి బర్త్‌డే సర్‌ప్రైజ్
అయితే, ఈ ప్రీ లుక్‌ను నవంబర్‌లో పూర్తిగా రివీల్ చేయనున్నట్లు ఆ పోస్ట్‌లో రాజమౌళి రాసుకొచ్చారు. ఈ లుక్‌తో మహేశ్ బాబు అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి “2025 నవంబర్‌లో ఫస్ట్ రివీల్” అని రాసుకొచ్చారు. అంటే, ఈ తాజాగా షేర్ చేసిన పూర్తి లుక్ లేదా టైటిల్‌ను రివీల్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఈ పోస్ట్ తర్వాత మరో ట్వీట్ చేసిన రాజమౌళి లాంగ్ నోట్ రాసుకొచ్చారు. “భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రియమైన సినిమా లవర్స్, మహేశ్ అభిమానులకు. మేము షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయింది. ఈ చిత్రం గురించి తెలుసుకోవడానికి మీ ఆత్రుతను మేము అభినందిస్తున్నాము” అని అన్నారు.
నవంబర్ 2025లో పూర్తి వివరాలు
“అయితే ఈ సినిమా కథ, పరిధి చాలా విశాలంగా ఉండడంతో కేవలం ఫొటోలు, ప్రెస్ మీట్లు పెట్టడంతో మాత్రమే మీకు న్యాయం చేయలేమని నా అభిప్రాయం. మేము సృష్టిస్తున్న అంతర్లీన ప్రపంచాన్ని ప్రదర్శించడానికి మేము ప్రస్తుతం ఏదో ఒకటి చేస్తున్నాము” అని జక్కన్న తెలిపారు.
“ఇది నవంబర్ 2025లో ఆవిష్కరించబడుతుంది. మీరు ఎన్నడు చూడని సీన్‌ను రివీల్ చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం” అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.
మహేశ్ బాబు అభిమానులకు రాజమౌళి ఇచ్చిన ఈ బిగ్ సర్‌ప్రైజ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. నవంబర్ 2025 వరకు కొత్త విషయాల కోసం ఎదురుచూడాలి.


