|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి నాటిన విష సంస్కృతి.. బ్రేక్ చేసింది ఆ ఒక్కడే!

Published: 02-06-2025, 11:50 AM
ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి నాటిన విష సంస్కృతి.. బ్రేక్ చేసింది ఆ ఒక్కడే!

ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. రాజమౌళి సినిమాలు దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. కానీ ఆయన సినిమాల విజయం ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆర్జీవీ తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించారు.

Key Points

1

రాజమౌళి సినిమాలు భారీ బడ్జెట్‌తో, అత్యధిక ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కాయి.

2

ఆయన సినిమాల విజయం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలకు ట్రెండ్‌ను సృష్టించింది.

4

ఆర్జీవీ రాజమౌళి సినిమాలను ఇండస్ట్రీకి శాపంగా అభివర్ణించాడు.

రాజమౌళి సినిమాల ప్రభావం

ఇండియన్ సినిమా రీజినల్ బారియర్స్ దాటుకుని గ్లోబల్ లెవెల్‌లో పోటీపడుతోంది. సౌత్, నార్త్ తేడాలు ఇప్పటికే చెరిగిపోగా.. మన ఫిల్మ్ మేకర్స్ హాలీవుడ్ రేంజ్ సినిమాలతో అదరగొడుతున్నారు. నిజానికి తన టాలెంట్‌తో ఇండియన్ ఫిల్మ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది రాజమౌళి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతం ఆయన సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో హాలీవుడ్ లెవెల్‌లో ఒక అడ్వెంచర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి కంటే ముందు తన మూవీస్‌తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై బలమైన ముద్ర వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. తన డిఫరెంట్ టేకింగ్, విజన్‌తో ఎన్నో మాస్టర్ పీస్ చిత్రాలను ఆడియన్స్‌కు అందించారు. ప్రస్తుతానికి తనకు నచ్చిన సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై ప్రయోగాలు చేస్తున్న ఆర్జీవీ.. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భారీ బడ్జెట్ చిత్రాల ట్రెండ్

ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ డ్యామేజ్ చేసింది రాజమౌళి అని ఆర్జీవీ అభిప్రాయపడ్డాడు. అందుకు కారణమేంటో కూడా ఇదే ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలు ట్రెమండస్ సక్సెస్ సాధించడమే ఇండస్ట్రీకి శాపంగా మారిందని తెలిపారు. భారీ బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్, వీఎఫ్‌ఎక్స్ వంటి హంగులతో 300, 400 రోజులు షూటింగ్ చేసుకుంటేనే భారీ సక్సెస్ లభిస్తుందని ఈ చిత్రాలు మెసేజ్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ విధంగా తన సినిమాల సక్సెస్‌తో రాజమౌళి ఇండస్ట్రీలో ఒక విష సంస్కృతి స్ప్రెడ్ అయ్యేందుకు పరోక్షంగా కారణమైనట్లు వెల్లడించారు. నిజానికి రాజమౌళి సినిమాలే లేకుంటే ఇండస్ట్రీలో అందరూ ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించి చేతులు కాల్చుకునేవారు కాదన్నారు.

సందీప్ రెడ్డి వంగా విజయం

అదే సమయంలో మరో తెలుగు దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు ఆర్జీవీ. రాజమౌళి తెచ్చిన ట్రెండ్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బ్రేక్ చేశాడని చెప్పారు. ఎందుకంటే రణబీర్ కపూర్‌తో సందీప్ తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని.. భారీ హంగులు లేకుండానే ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కోట్లు కొల్లగొట్టిందని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఇద్దరు తెలుగు దర్శకులే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడం విశేషం.

రాజమౌళి సినిమాలు భారీ విజయం సాధించినప్పటికీ, వాటి ప్రభావం ఇండస్ట్రీపై ఎలా ఉందో ఆర్జీవీ వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా విజయం ఈ చర్చకు మరో కోణాన్ని అందిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.