|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతకంటే పెద్ద సర్టిఫికేట్ ఉండదు.. జెనీలియాను కొత్తగా చూపిస్తారని ఉంది.. డైరెక్టర్ రాజమౌళి కామెంట్స్

Published: 17-07-2025, 1:10 AM
ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతకంటే పెద్ద సర్టిఫికేట్ ఉండదు.. జెనీలియాను కొత్తగా చూపిస్తారని ఉంది.. డైరెక్టర్ రాజమౌళి కామెంట్స్

కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న ‘జూనియర్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా నటీనటులు, టెక్నీషియన్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Key Points

1

రాజమౌళి 'జూనియర్' సినిమాపై ప్రశంసలు కురిపించారు.

2

జెనీలియా, కిరీటి రెడ్డి, శ్రీలీల నటనను ప్రశంసించారు.

4

కిరీటి రెడ్డికి ఇంతకంటే పెద్ద సర్టిఫికేట్ లేదని రాజమౌళి అన్నారు.

జూనియర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమా జూనియర్ . రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. జూలై 18న జూనియర్ విడుదల కానుంది.

ఈ సందర్భంగా తాజాగా జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జెనీలియా, కిరీటి, సెంథిల్, దేవి శ్రీ ప్రసాద్ తదితర టెక్నిషియన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ రాజమౌళి.

ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మంచి కథతో ఒక చిన్న సినిమా చేస్తున్నారని అనుకున్నాను. కానీ, శ్రీలీల , జెనీలియా, రవిచంద్రన్ గారు, దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్, పీటర్, ఇలా ఒక్కొక్క ఎడిషన్ చూస్తుంటే ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే నటీనటులు టెక్నీషియన్స్ ఉంటారో అలా పెట్టుకుంటూ తీసుకెళ్లారు” అని అన్నారు.

రాజమౌళి ప్రశంసలు

“చాలా పెద్ద సినిమా చేశారు. సినిమా 1000 + ప్లస్ స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుందంటే దానికి కారణం ఆడియన్స్‌లో ఉన్న ఇంట్రెస్ట్. ఆడియన్స్‌కి ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. సినిమాని ఈ లెవెల్‍కి తీసుకొచ్చిన సాయిగారిని అభినందిస్తున్నాను” అని రాజమౌళి తెలిపారు.

” జెనీలియా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. సెంథిల్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూపిస్తారని నమ్మకం ఉంది. దేవి ఎప్పుడు కూడా తన మ్యూజిక్‌తో సినిమాని ఎలివేట్ చేస్తాడు. వైరల్ వయ్యారి ఎంత వైరల్ అయిందో మళ్లీ దాని గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయించిన సాంగ్ అది” అని జక్కన్న చెప్పారు.

“సెంథిల్ గురించి చెప్పాలంటే సొంత ఇంట్లో మనిషి గురించి చెప్పినట్టే ఉంటుంది. తను అద్భుతమైన టెక్నీషియన్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్‌ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. ఈ సినిమాకి తను బిగ్ ఎసెట్. పీటర్ క్రేజీ మ్యాన్. ఇంకా ఏదో బెటర్‌గా చేయాలనే తపన తనలో ఉంటుంది. విపరీతంగా కష్టపడతాడు” అని రాజమౌళి అన్నారు.

జెనీలియా కొత్త పాత్ర

“పీటర్, సెంథిల్ ఇద్దరు కలిసి ఒక అబ్బాయి బాగా చేస్తున్నాడని చెప్బుతున్నారంటే.. కిరీటీకి అంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండదు. వాళ్లు బాగా పొగుడుతున్నారంటే ఇది నిజంగా బెస్ట్ కాంప్లిమెంట్స్. ఈ సినిమా కిరీటీని తప్పకుండా పెద్ద స్థాయికి వెళుతుంది” అని రాజమౌళి పేర్కొన్నారు.

“శ్రీలీల అద్భుతమైన డాన్సర్. తను ఇంకా పెద్దస్థాయికి వెళుతుంది. రాధాకృష్ణ మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు మీద ఉన్నారు. ఈ సినిమా కోసమే కష్టపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టుని బయటకు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చి తనకు మంచి పేరు తీసుకొస్తుంది. పైసా వసూల్ మూవీ ఇది” అని రాజమౌళి తన స్పీచ్ ముగించాడు.

మొత్తంమీద, రాజమౌళి వ్యాఖ్యలు ‘జూనియర్’ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.