
📌 Key Points
- చిరంజీవి ‘కొండవీటి దొంగ’ సినిమాలోని సన్నివేశం రాజమౌళిని నిరాశపరిచింది!
- రామ్ చరణ్ ‘మగధీర’లో గుర్రంతో ఎమోషనల్ సీన్ పెట్టి జక్కన్న తన కోరిక తీర్చుకున్నారు.
- చిరంజీవి నటన, ఆయన ఎదుగుదల రాజమౌళికి స్ఫూర్తినిచ్చాయని స్వయంగా వెల్లడి.
- తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి కృషిని కొనియాడిన మెగా అభిమానులు!
టాలీవుడ్ సంచలనం! రాజమౌళి మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు రాజమౌళి ఎందుకు అలా అన్నారు? రామ్ చరణ్ తో ఆ సినిమాను ఎలా పూర్తి చేశారు? తెలుసుకోవాలంటే చదవండి!
చిరంజీవి సినిమాపై రాజమౌళి అసంతృప్తి!
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గతంలో ఎవరికి పెద్దగా తెలియదు, బాలీవుడ్, కోలీవుడ్.. మన ఇండస్ట్రీని తక్కువ చేసి చూసేవారు. ఆ పరిస్థితిని బాహుబలి సినిమాతో మార్చి, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని దేశవ్యాప్తంగా పెంచి.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిపెట్టిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి.
ఆయన బాటలో నడిచి మరికొంత మంది దర్శకులు మన తెలుగు సినిమాకు వన్నెతెచ్చారు. పాన్ ఇండియా సినిమాలతో మన తెలుగు హీరోలు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఇదంతా రాజమౌళి వల్లే సాధ్యం అయ్యింది. అంతే కాదు తెలుగు సినిమాకు మొదటి ఆస్కార్ సాధించిన ఘనత కూడా రాజమౌళిదే.
రామ్ చరణ్‌తో జక్కన్న సంచలన సీన్!
రాజమైళి చిన్నతనం నుంచి సినిమా వాతవరణంలో పెరిగారు. ఆయన మన తెలుగు దర్శకులు, నటీనటుల నుంచి చాలా నేర్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, తో పాటు తనకు ఎంతో ఇష్టమైన మహానటి సావిత్రి నటన, చిరంజీవి ఇండస్ట్రీలో ఎదిగిన విధానం.. ఆయన కృషి.. ఇలా రాజమౌళి ఎదుగుదలతో ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నుంచి రాజమౌళి చాలా నేర్చుకున్నారు. ఆయన సినిమాలంటే జక్కన్నకు చాలా ఇష్టం. మెగాస్టార్ గురించి చాలా సందర్భాల్లో రాజమౌళి గొప్పగా చెప్పారు. ఇక ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ.. ఓ సారి ఎమోషనల్ అయ్యారు.
చిరంజీవి సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ” నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలన్నీ నేను చూశారు. ఓసారి కొండవీటి దొంగ సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ సినిమాలో మునిగిపోయి చూస్తున్నా.. కొన్ని సీన్స్ చూస్తూ ఏడ్చేస్తున్నా.. అందులో ఒక సన్నివేశం ఉంటుంది. హీరో కష్టంలో ఉంటే.. అతని గుర్రం వచ్చి కాపాడుతుంది. అప్పుడు ఆ సీన్ అంతటితో కట్ అయ్యింది. అది చూసి నేను చాలా డిస్సపాయింట్ అయ్యాను. అసలు అక్కడ గుర్రానికి.. హీరోకి మధ్య ఎమోషనల్ సీన్ ఉండాలి కదా” అని జక్కన్న అన్నారు.
మెగాస్టార్‌పై రాజమౌళి ఎమోషనల్ కామెంట్స్!
రాజమౌళి మాట్లాడుతూ.. ” కొండవీటి దొంగ సినిమాలో గుర్రం చావు నుంచి హీరోను కాపాడుుతంది. అప్పుడు గుర్రానికి, హీరోకి మధ్య ఎమోషనల్ సీన్ ఉండాలి కదా.. దానికి కృతజ్ఞత తెలపాలి కదా.. అక్కడ నేను చాలా డిస్సపాయింట్ అయ్యాను. అప్పటి నుంచి నా మనసులో అది ఉండిపోయింది. దాన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను. లక్కీగా రామ్ చరణ్ తో మగధీర సినిమా చాన్స్ వచ్చింది. అప్పుడు అలాంటి సీన్ ఇందులో పెట్టి.. గుర్రం రామ్ చరణ్ ను కాపాడగానే అతను దాన్ని ప్రేమగా నిమురుతూ.. కృతజ్ఞతలు తెలుపుతాడు.. అప్పుడు ఆ సీన్ కంప్లీట్ అయినట్టు అనిపించింది. ” అని రాజమౌళి అన్నారు.
ఎంత ఘనత సాధించినా.. రాజమౌళి మాత్రం చాలా సింపుల్ గా, కూల్ గా కనిపిస్తుంటారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి సినిమాను రూపొందిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగతోంది. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, అనుకున్న తేదీకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీ.. 2027 సమ్మర్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటాం.


