|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rajamouli : రాజమౌళి సినిమాకు కష్టాలు.. అందుకే వారణాసి ఈవెంట్.. నిర్మాతగా రాజమౌళి కొడుకు మాట్లాడటంతో..

Published: 15-11-2025, 11:41 PM
Rajamouli : రాజమౌళి సినిమాకు కష్టాలు.. అందుకే వారణాసి ఈవెంట్.. నిర్మాతగా రాజమౌళి కొడుకు మాట్లాడటంతో..

రాజమౌళి – మహేష్ బాబు సినిమా ‘వారణాసి’ టైటిల్ ఈవెంట్ అంచనాలకు మించి జరిగింది. అయితే, ఈ గ్రాండ్ ఈవెంట్ వెనుక సినిమా బడ్జెట్ కష్టాలు, నిర్మాత మార్పు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా మాట్లాడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

Key Points

1

రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ 'వారణాసి' ఈవెంట్ భారీ ఎత్తున జరిగింది.

2

సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే పెరిగిందని, నిర్మాత కేఎల్ నారాయణ కష్టపడుతున్నారని టాక్.

4

ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకే భారీ ప్రమోషన్లు, ఈవెంట్ హక్కులు జియో హాట్ స్టార్ కు రూ.50 కోట్లకు అమ్మకం.

వారణాసి ఈవెంట్ వెనుక అసలు కథ

Rajamouli  : రాజమౌళి – మహేష్ బాబు సినిమా టైటిల్ వారణాసి అని నిన్న భారీ ఈవెంట్ పెట్టి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపారు. అసలు సినిమా టైటిల్ కోసం ఈ రేంజ్ ఈవెంట్ ని రాజమౌళి ఎప్పుడూ పెట్టలేదు. అసలు రాజమౌళి తెలుగులో ఈ రేంజ్ ప్రమోషన్స్ ఎప్పుడూ చేయలేదు. గతంలో RRR సమయంలో కూడా బాలీవుడ్ లో చేసారు కానీ ఇక్కడ ఈ రేంజ్ ఈవెంట్స్ చేయలేదు. బాహుబలి 2 సమయంలో కూడా ఒకటే పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు అంతే.(Rajamouli)

రాజమౌళి – మహేష్ సినిమాకు సాయి దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి ఈ సినిమా గురించి ఓ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగిందని, అంత బడ్జెట్ నిర్మాత నారాయణ పెట్టలేకపోతున్నారని, అందుకే రాజమౌళిని తాను నిర్మాతగా మారి డబ్బులు తీసుకొస్తున్నట్టు టాక్ వచ్చింది.

రాజమౌళి సినిమాకు బడ్జెట్ కష్టాలు నిజమా?

నిన్న జరిగిన వారణాసి ఈవెంట్లో రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా మాట్లాడాడు. దీంతో దీనిపై మరింత క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు KL నారాయణ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వగా యిప్పుడు రాజమౌళి ఇన్వెస్టర్స్ ని, ఫైనాన్షియర్స్ తెప్పించి ఈ సినిమాకు డబ్బులు పెట్టిస్తున్నారని అందుకే నిర్మాతగా తన కొడుకు పేరు వేశారని అంటున్నారు. సినిమాకు హైప్ తెప్పించి, జనాలు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో చూపించి సినిమా నిర్మాణానికి డబ్బులు తెచ్చుకుందామని రాజమౌళి ఈ ఈవెంట్ భారీగా ప్లాన్ చేసాడని అంటున్నారు.

అందుకే ఈ ఈవెంట్ హక్కులు కూడా డబ్బుల కోసం జియో హాట్ స్టార్ ఓటీటీకి భారీ ధరకు అమ్ముకున్నారు. దాదాపు 50 కోట్లపైనే ఈ ఈవెంట్ హక్కులు జియో హాట్ స్టార్ కి అమ్మారట. సాయి దుర్గ ఆర్ట్స్ మాత్రమే కాకుండా షోయింగ్ బిజినెస్ అనే నిర్మాణ సంస్థ పేరుని కూడా వారణాసి గ్లింప్స్ లో జత చేసారు.

నిర్మాతగా రాజమౌళి కొడుకు కార్తికేయ ఎందుకు?

దీంతో రాజమౌళి – మహేష్ సినిమాకు బడ్జెట్ పెరిగిందని, దానికి కావాల్సిన డబ్బులు సర్దడంలో నిర్మాత కష్టపడటంతో రాజమౌళి తానే ఇన్వెస్టర్స్ ని తెప్పిస్తున్నాడని తెలిసింది. గతంలో కూడా బాహుబలి సమయంలో పార్ట్ 2 కి రాజమౌళి ఏదో ఒకటి చేసి బాలీవుడ్ నుంచి ఇన్వెస్టర్స్ ని తెప్పించాలనుకున్నాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో రాజమౌళి కూడా నిర్మాతగా మారడంతో రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో షేర్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. కార్తికేయ కూడా గతంలో రాజమౌళి సినిమాలకు బాగానే పని చేసాడు. ఇప్పుడు ఈ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు తీసుకోవడంతో మరింత ఎక్కువ కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో కార్తికేయకు హాలీవుడ్ లెవల్లో నిర్మాతగా పేరు రావడం ఖాయం.

మొత్తం మీద రాజమౌళి – మహేష్ సినిమాకు బడ్జెట్ విషయంలో కష్టాలు ఉన్నాయని, అందుకే ఈ భారీ ప్రమోషనల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారని స్పష్టమవుతోంది. రాజమౌళి స్వయంగా ఇన్వెస్టర్లను రంగంలోకి దించుతూ, తన కొడుకును నిర్మాతగా పరిచయం చేయడం గమనార్హం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.