
మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పుష్ప సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఫహద్, తన రిటైర్మెంట్ తర్వాత స్పెయిన్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేయాలని అనుకుంటున్నారట!
Key Points
ఫహద్ ఫాజిల్ తన రిటైర్మెంట్ తర్వాత స్పెయిన్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేయాలని అనుకుంటున్నారు.
బార్సిలోనా నగరం ఆయనకు ఎంతో నచ్చిందని ఫహద్ తెలిపారు.
యాక్టింగ్‌లో అనుభవం తర్వాత కొత్త అనుభవాన్ని పొందాలనే ఆయన ఆశ.
ఫహద్ భార్య నజ్రియా ఈ నిర్ణయానికి అంగీకరిస్తుందా అనేది ఆసక్తికరమైన అంశం.
ఫహద్ ఫాజిల్ రిటైర్మెంట్ ప్లాన్
Fahadh Faasil : మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పుష్ప సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో నటించి మెప్పించారు. ఇక తన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతుండటంతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఫహద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నేడు రిలీజవ్వబోతున్న తన సినిమా మరీసన్ ప్రమోషన్స్ లో భాగంగా నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి కూడా చెప్పాడు.
స్పెయిన్‌లో క్యాబ్ డ్రైవర్‌గా?
నజ్రియా ప్రతిస్పందన ఎలా ఉంటుంది?
ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. ఇటీవల నేను స్పెయిన్ దేశంలోని బార్సిలోనాకి వెళ్ళాను. ఆ సిటీ నాకు నచ్చింది. నేను యాక్టింగ్ నుంచి రిటైర్ అయ్యాక అక్కడ క్యాబ్ డ్రైవర్ గా పనిచేయాలి అనుకుంటున్నాను. ఒక మనిషిని తన గమ్యానికి చేర్చడంలో మంచి అనుభూతి ఉంది. డ్రైవింగ్ అంటే ఇష్టం ఉన్నవారికి అది ప్రశాంతతను కూడా ఇస్తుంది అని తెలిపాడు. మరి ఫహద్ నిజంగానే రిటైర్ అయిన తర్వాత స్పెయిన్ వెళ్ళిపోయి అక్కడ క్యాబ్ డ్రైవర్ గా చేస్తాడా? అతని భార్య హీరోయిన్ నజ్రియా ఒప్పుకుంటుందా చూడాలి మరి.
ఫహద్ ఫాజిల్ యొక్క రిటైర్మెంట్ ప్లాన్ చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే, ఆయన నిజంగానే ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.


