|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి షాకింగ్ కామెంట్స్! ఇక హాలీవుడ్ కు నో చెప్పిన జక్కన్న! వైరల్ న్యూస్!

Published: 25-02-2026, 9:35 PM
రాజమౌళి షాకింగ్ కామెంట్స్! ఇక హాలీవుడ్ కు నో చెప్పిన జక్కన్న! వైరల్ న్యూస్!
  • రాజమౌళి సంచలన ప్రకటన: ఇక హాలీవుడ్ అవసరం లేదు!
  • అన్నపూర్ణ స్టూడియోలో అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
  • వారణాసి సినిమా కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించిన రాజమౌళి.
  • త్వరలో అన్ని చిత్ర పరిశ్రమలకి అందుబాటులోకి రానున్న మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ.

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. ఇకపై హాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

హాలీవుడ్ కు గుడ్ బై చెప్పిన రాజమౌళి

Rajamouli : ఇటీవల వచ్చే సినిమాలకు విజువల్స్ భారీగా ఉండటంతో CGలు, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఎక్కువగా అవసరం అవుతున్నాయి. దీనికోసం హాలీవుడ్ స్టూడియోలకు వెళ్లాల్సి వస్తుంది. మన దగ్గర మోషన్ క్యాప్చర్ షూట్ చేసేందుకు లేదు. దీంతో కొన్ని సినిమాలు హాలీవుడ్ స్టూడియోలకు వెళ్లి చేస్తున్నాయి.

ఈ క్రమంలో నాగార్జున, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ హాలీవుడ్ స్టూడియోలు యానిమాట్రిక్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఏ అండ్‌ ఎం మోషన్‌ క్యాప్చర్‌ ల్యాబ్‌ కలిసి ఇక్కడ మన హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ని స్థాపించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీగా ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ని నిర్మించారు. ఇందుకు కావాల్సిన సాంకేతికత అంతా తీసుకొచ్చారు. రాజమౌళి దీన్ని ఆవిష్కరించారు ఇటీవల.

అన్నపూర్ణ స్టూడియోలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ

తాజాగా ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ గురించి రాజమౌళి, నాగార్జున, శోభు.. మాట్లాడుతూ, అక్కడ మోషన్ క్యాప్చర్ లో షూటింగ్ ఎలా చేసారు అని చూపిస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేసారు.

వారణాసి షూటింగ్ విశేషాలు

ఈ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలి, ఈగ సినిమాలు చేస్తున్నప్పుడు మన దగ్గర మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ అందుబాటులో ఉంటే బాగుండేదని అనుకున్నాను. ఇప్పుడు ఆ టెక్నాలజీ అన్నపూర్ణ స్టూడియోలోనే అందుబాటులోకి వచ్చింది. ఆల్రెడీ వారణాసి సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని వాడి కొన్ని సీన్స్ షూటింగ్ చేశాను. అవి అద్భుతంగా వచ్చాయి అని అన్నారు. దీంతో అన్నపూర్ణ స్టూడియోలో అన్ని సినీ పరిశ్రమల వాళ్ళు ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కోసం వస్తారని తెలుస్తుంది.

ఇక మన టాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.