|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసిపై జక్కన్న సంచలన నిర్ణయం! దురంధర్ 2 ఎఫెక్ట్ మామూలుగా లేదుగా!!

Published: 31-03-2026, 3:05 AM
వారణాసిపై జక్కన్న సంచలన నిర్ణయం! దురంధర్ 2 ఎఫెక్ట్ మామూలుగా లేదుగా!!
  • దురంధర్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు, బాహుబలి 2 రికార్డు బ్రేక్!
  • రాజమౌళి వారణాసి సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు.
  • వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమాను గ్రాండ్ నెరేటివ్‌గా అందించాలని జక్కన్న భావిస్తున్నారు.
  • దురంధర్ 2 సక్సెస్ చూసి రాజమౌళి కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని ఫ్యాన్స్ డిస్కషన్స్!

టాలీవుడ్ ప్రేక్షకులారా దృష్టి పెట్టండి! జక్కన్న రాజమౌళి తన తదుపరి చిత్రం వారణాసి గురించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దురంధర్ 2 సినిమా చూసిన తర్వాత ఆయన ఆలోచనలు మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

దురంధర్ 2 ఎఫెక్ట్: రాజమౌళి ప్లాన్స్ మార్పు!

Varanasi : రణవీర్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దురంధర్‌ 2. నాలుగు గంటల ఎపిక్ రన్‌టైమ్‌తో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. నార్త్ అమెరికాలో బాహుబలి 2 రికార్డును కూడా మించి ఓపెనింగ్ వీకెండ్‌లోనే 150మిలియన్ డాలర్లు క్రాస్ చేయడం ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది.

ఈ సక్సెస్ చూసి నెక్ట్స్‌ ప్రాజెక్ట్ విషయంలో జక్కన్న తన ఆలోచన మార్చుకున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఒకే పార్ట్‌గా కాకుండా వారణాసి (Varanasi) మూవీని రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడనే చర్చ నడుస్తోంది. దురంధర్‌ 2 భారీ స్కేల్‌, విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ టెల్లింగ్ స్టైల్ చూసి ఫిదా అయిన రాజమౌలి తన వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా కంటెంట్‌ను ఒకే భాగంలో కుదించకుండా గ్రాండ్ నెరేటివ్‌గా రెండు పార్టులుగా మార్చి ప్రేక్షకులకు ఎపిక్ అనుభవం అందించాలని భావిస్తున్నాడట.

వారణాసి మూవీ రెండు పార్టులుగా రానుందా?

దీనికోసం తన టీమ్‌లోని సీనియర్ స్క్రిప్ట్ రైటర్లతో జక్కన్న మీటింగ్స్ కూడా స్టార్ట్ చేశాడని టాక్‌. ఇది రాజమౌళి స్టైల్‌కు కొత్త ట్విస్ట్ అనే డిస్కషన్ నడుస్తోంది. గతంలో బాహుబలిని రెండు భాగాలుగా తీసుకెళ్లిన అనుభవం ఉన్నా.. ధురంధర్ 2లాంటి హైప్ చూసి మరింత అప్‌గ్రేడ్ చేసుకోవాలని డిసైడ్ కావడం ఫస్ట్ టైమ్‌.

జక్కన్న టీమ్ మీటింగ్స్ స్టార్ట్!

ఓవరాల్‌గా ధురంధర్ 2 సక్సెస్.రాజమౌళిలాంటి మెగా డైరెక్టర్లపై కూడా కొత్త టార్గెట్ పెట్టినట్లు అయిందని ఫ్యాన్స్ డిస్కస్‌ చేసుకుంటున్నారు. దీంతో వారణాసి మూవీ ఎలా ఉండబోతోంది. రెండు భాగాలుగా ఎలా డివైడ్ చేస్తారంటూ.. ఫ్యాన్స్‌లో కొత్త చర్చ మొదలైంది.

వారణాసి సినిమా రెండు భాగాలుగా ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.