|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బైకర్ మూవీతో రాజశేఖర్ రీఎంట్రీ: ఫ్యామిలీ సపోర్ట్ గురించి షాకింగ్ విషయాలు!

Published: 31-03-2026, 2:05 PM
బైకర్ మూవీతో రాజశేఖర్ రీఎంట్రీ: ఫ్యామిలీ సపోర్ట్ గురించి షాకింగ్ విషయాలు!
  • రాజశేఖర్ ‘బైకర్’ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
  • ఈ సినిమా భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వెంచరస్ చిత్రంగా రూపొందుతోంది.
  • దర్శకుడు అభిలాష్ రెడ్డి నటన విషయంలో రాజీపడకుండా పని చేస్తారని రాజశేఖర్ అన్నారు.
  • యూవీ క్రియేషన్స్ ఈ సినిమా కోసం ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదని రాజశేఖర్ తెలిపారు.

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ‘బైకర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి, దర్శకుడు అభిలాష్ రెడ్డి గురించి, యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువ గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

బైకర్ చిత్ర విశేషాలు తెలిపిన రాజశేఖర్

Rajasekhar: యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Angry Man Rajasekhar) సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అనుకుంటున్న సమయంలో ‘బైకర్’ (Biker)‌లో అంటూ వారిలో సంతోషం నింపారు. చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand), అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామాలో ఆయన ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా యాక్టర్ రాజశేఖర్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు.

దర్శకుడు అభిలాష్ రెడ్డి గురించి రాజశేఖర్

‘‘డైరెక్టర్ అభిలాష్ చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ కావాలో చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయనకు కథ, క్యారెక్టర్స్ మీద చాలా గ్రిప్ ఉంది. అనుకున్నది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న దర్శకుడు. అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ముఖ్యంగా నా పాత్రకు సంబంధించి ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూపించారు. డైరెక్టర్ విజన్, కథ వల్లే అది సాధ్యపడింది. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా నా పాత్రని అభినందిస్తారు. ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ చాలా అద్భుతంగా కుదిరాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అదే టైమ్‌లో ఫాదర్, సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా పండింది. చాలా సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ సంస్థ అంటే రాయల్ ట్రీట్మెంట్ అని నాకు ఇప్పుడు తెలిసింది. అసలెక్కడా ఖర్చుకి వెనకాడలేదు. ఈ సినిమాను హాలీవుడ్ క్వాలిటీతో తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సబ్జెక్టు, క్వాలిటీ కోసం ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. ఈ విషయంలో వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించి వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది.

యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు అద్భుతం

సినిమాల విషయంలోనూ, ఇంకా ఏదైనా సరే.. నాకు నా ఫ్యామిలీ ఎప్పుడూ బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఈ సినిమా, నా క్యారెక్టర్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సపోర్టు చాలా గొప్పది. ఈ సినిమా నేను చేసినప్పుడు.. నన్ను స్కూల్‌కి డ్రాప్ చేసి.. మళ్లీ అక్కడి నుంచి తీసుకెళ్లే ఒక మదర్ లాగా చూసుకున్నారు. మా ప్యాషన్, ప్రొఫెషన్ రెండు సినిమానే. ఇంట్లో కూడా ఎక్కువగా సినిమా వాతావరణమే ఉంటుంది. కొత్త సినిమాలు రిలీజ్ అయితే నేరుగా థియేటర్స్‌కు వెళ్లి చూస్తుంటాం. అలాగే ఏదైనా కథ, క్యారెక్టర్ వస్తే అందరం కలిసి డిస్కస్ చేసుకుంటాం. అలాగే షూటింగ్‌లో జరిగిన విశేషాలు కూడా మాట్లాడుకుంటాం. మేమందరం కూడా సినిమా ప్రొఫెషన్‌లోనే ఉన్నాం కాబట్టి, చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ‘బైకర్’ తర్వాత రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి ‘మగాడు’ అనే చిత్రం. ఇది ఇంకా 20 శాతం బ్యాలెన్స్ ఉంది. మరో చిత్ర ప్రకటన త్వరలోనే వస్తుంది’’ అని, ఈ యాంగ్రీమ్యాన్ చెప్పుకొచ్చారు.

రాజశేఖర్ ‘బైకర్’ చిత్రం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుందని, తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.