
📌 Key Points
- రాజస్థాన్‌లో విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంచేందుకు ‘సార్థక్ నామ్ అభియాన్’ ప్రారంభం
- అర్థంలేని, వింత పేర్లను మార్చి గౌరవప్రదమైన పేర్లుగా మార్చనున్నారు
- 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల పేర్లను మార్చేందుకు అవకాశం
- కులాల పేర్లతో ఉన్న పదాలను కూడా తొలగించాలని ప్రభుత్వం ఆదేశం
రాజస్థాన్ ప్రభుత్వం విద్యావ్యవస్థలో కీలక మార్పులు చేస్తోంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ‘సార్థక్ నామ్ అభియాన్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా విద్యార్థుల పేర్లను మార్చనున్నారు.
సార్థక్ నామ్ అభియాన్: ముఖ్య ఉద్దేశ్యం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం (Rajasthan Government) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘సార్థక్ నామ్ అభియాన్’ (Sarthak Naam Abhiyan) పేరుతో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా అర్థరహితంగా, వింతగా ఉన్న విద్యార్థుల పేర్లను గౌరవప్రదమైన పేర్లుగా మార్చనున్నారు. అయితే, చాలామంది తల్లిదండ్రులు అవగాహన లేక లేదా చిన్నప్పుడు సరదాగా షైతాన్, షేరు, కాలు, టింకూ వంటి పేర్లను పెట్టినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే విద్యార్థులు పెరిగి పెద్దయ్యాక, ఆ పేర్లు పట్టుకుని తోటి విద్యార్థుల హేళన చేస్తుండటంతో కొందరు సిగ్గు, అవమానంతో పాఠశాలలకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ మంత్రి వర్గంలో నిర్ణయించి ‘సార్థక్ నామ్ అభియాన్’ పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
ఈ కార్యక్రమం కోసం విద్యాశాఖ సుమారు 3 వేల అర్థవంతమైన పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఆరవ్, అథర్వ, బాలముకుంద్, బద్రీనాథ్ వంటి 1,409 పేర్లు, ఇక బాలికలకు ఆరాధ్య, అన్నపూర్ణ, వైష్ణవి వంటి 1,541 పేర్ల జాబితాను తల్లిదండ్రులకు అందించి, వారి రాతపూర్వక అనుమతితోనే 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల పేర్లను అధికారిక రికార్డుల్లో మారుస్తారు. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో పేరు కీలక పాత్ర పోషిస్తుందని, అర్థవంతమైన పేర్లు వారిలో గౌరవాన్ని, ధైర్యాన్ని నింపుతాయని ప్రభుత్వం పేర్కొంది. కులాల పేర్లతో ముడిపడి ఉన్న లేదా అవమానకరంగా అనిపించే పదాలను కూడా రికార్డుల నుంచి తొలగించాలని సర్కార్ విద్యాశాఖ అధికారులకు స్పష్టం చేసింది.
పేర్ల మార్పు ప్రక్రియ ఎలా?
ప్రభుత్వ లక్ష్యం ఏమిటి?
ఈ నిర్ణయం విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.


