|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజీవ్ కనకాలకు షాక్! స్కూల్ ఈవెంట్ వెనుక భారీ కుట్ర? అసలు నిజం ఇదే!

Published: 13-05-2026, 4:46 PM
రాజీవ్ కనకాలకు షాక్! స్కూల్ ఈవెంట్ వెనుక భారీ కుట్ర? అసలు నిజం ఇదే!
  • హైదరాబాద్‌లోని ‘వైబ్రాంట్’ స్కూల్ ఈవెంట్‌కు రాజీవ్ కనకాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆరోపించింది.
  • తాను కేవలం అతిథిగా వెళ్లానని, ఆరోపణలు తెలియవని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు.
  • తన ఫోటోలు, వీడియోలు ప్రమోషన్లకు వాడొద్దని స్కూల్‌కు సూచించారు.

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఒక స్కూల్ ఈవెంట్ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని ‘వైబ్రాంట్’ స్కూల్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన ఆయనపై, ఆ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై రాజీవ్ కనకాల వివరణ ఇచ్చారు.

వివాదానికి దారితీసిన స్కూల్ ఈవెంట్

Rajeev Controversy : రాజీవ్ కనకాల.. దేవదాసు కనకాల కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఆడియన్స్ లో మంచి క్రేజ్ కొట్టేసిన వెర్సటైల్ యాక్టర్.ఇక కెరీర్ మొదలెట్టి మూడు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ లైమ్ లైట్లో ఉండటం విశేషం.అలారుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ‘రాజీవ్’ తాజాగా ఒక స్కూల్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు.

మాములుగా  సెలబ్రిటీలు వివిధ విద్యాసంస్థల ఈవెంట్స్ కి ,యానివర్సరీలకి చీఫ్ గెస్ట్ లుగా వెళ్ళడం మనం చూస్తునే ఉంటాం. అలాగే రాజీవ్ కూడా హైదరాబాద్‌లోని ‘వైబ్రాంట్’ అనే స్కూల్ నిర్వహించిన ప్రోగ్రామ్‌కు రాజీవ్ కనకాల చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు. పనిలో పనిగా అక్కడ టాలెంటెడ్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ గిఫ్ట్స్ కూడా అందించాడు.అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయ్యింది. ఆ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని, అలాంటి సంస్థను రాజీవ్ వంటి పాపులర్ యాక్టర్ ప్రమోట్ చేయడం ఏంటి అంటూ తీవ్ర అభ్యంతరం తెలిపింది నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ .

రాజీవ్ కనకాల వివరణ, స్పష్టత

అలెర్ట్ అయిన రాజీవ్ కనకాల

ఇక ఈ కాంట్రవర్సీ చిలికి చిలికి గాలి వాన అవుతుండటంతో అలెర్ట్ అయ్యాడు రాజీవ్ కనకాల.”నేను ఆ స్కూల్‌కు కేవలం అతిథిగా మాత్రమే వెళ్లాను. అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడటం, పిల్లలకు అవార్డులు ఇవ్వడం ఒక సెలబ్రిటీగా నా బాధ్యతగా భావించాను. కానీ ఆ స్కూల్‌పై ఏవైనా ఆరోపణలు ఉన్నాయనే విషయం నాకు ముందుగా తెలియదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు స్కూల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మీ పిల్లలని అందులో జాయిన్ చేయించండి అంటూ పిల్లల తల్లి దండ్రులకి సూచించాడు.ఇక తన ఫోటోలను, వీడియోలను స్కూల్ ప్రమోషన్ల కోసం వాడవద్దని యాజమాన్యానికి ముందే చెప్పానని క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్

నెటిజన్ల మద్దతు, భవిష్యత్ పరిణామాలు

ఇక తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాజీవ్ ని , ఇలాంటి అనవసర కాంట్రవర్సీలోకి లాగడంపై ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్లు.ఇక ఈ క్రమంలో ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ క్లారిటీ తర్వాత నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా సెలబ్రిటీలు ఇలాంటి ఈవెంట్లకు వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ ఇన్సిడెంట్ మరోసారి ప్రూవ్ చేసింది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ఈ వివాదం సెలబ్రిటీలు ఇలాంటి ఈవెంట్లకు హాజరయ్యే ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. రాజీవ్ కనకాల వివరణతో వివాదం సద్దుమణిగినా, నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి తదుపరి స్పందన ఆసక్తికరంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.