
📌 Key Points
- రాజేంద్ర ప్రసాద్ నోరు జారడంతో ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ!
- విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన రాజేంద్ర ప్రసాద్!
- విశాల్, నాజర్ వంటి నటుల నుండి తీవ్ర విమర్శలు!
- ఎంజీఆర్ గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికిన నటులు!
టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఎంజీఆర్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాన్ని రేకెత్తించాయి. దీనిపై ఆయన ఎలా స్పందించారో చూడండి.
ఎంజీఆర్‌పై రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
Rajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాడు. తమిళ దివంగత లెజెండరీ నటుడు, మాజీ సీఎం ఎంజీఆర్ పై తాను చేసిన కామెంట్స్ కు చింతిస్తున్నట్లు తమిళంలో మాట్లాడుతున్న ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య స్టేజీ ఎక్కితే చాలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. అప్పట్లో అలీ, బ్రహ్మానందంలాంటి వాళ్లపై నోరు పారేసుకున్న అతడు.. ఈ మధ్యే కాంతారావు అవార్డు అందుకుంటూ తమిళ దివంగత నటుడు ఎంజీఆర్ పై నోరు జారాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెబుతూ తమిళంలో మాట్లాడిన ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
నోరు జారాను.. క్షమించండి..
విమర్శించిన నటులు విశాల్, నాజర్
‘‘ఒకప్పుడు కాంతారావు జానపదా చిత్రాల కోసం జనాలు ఎగబడేవాళ్లు. కాంతారావును చూసి ఎంజీఆర్ కూడా భయపడేవాడు. కాంతారావును చూస్తే ఎంజీఆర్ కు ఉ**’’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
‘‘తెలుగు ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఈవెంట్లో చేసిన కామెంట్లు విని షాక్ కు గురయ్యా’’ అని తన పోస్టులో విశాల్ రాసుకొచ్చాడు.
తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పిన రాజేంద్రుడు
‘‘లెజండరీ యాక్టర్, వన్ అండ్ ఓన్లీ ఎంజీఆర్ గురించి మీ స్పీచ్ ను బరువైన హృదయంతో ఖండిస్తున్నా. దివంగత ఎంజీఆర్ కేవలం దిగ్గజ నటుడు మాత్రమే కాదు తమిళనాడులో గొప్ప లీడర్. మరో దిగ్గజ నటుడు కాంతారావును పొగుడుతూ మీరు మాట్లాడటం బాగుంది. కానీ కాంతారావు గురించి పొగుడుతూ ఎంజీఆర్ ను తక్కువ చేయడం సరికాదు’’ అని విశాల్ తన పోస్టులో పేర్కొన్నాడు.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మరో నటుడు నాజర్ కూడా రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ ను ఖండించాడు. తాము తెలుగు నటులను ఎంతో గౌరవిస్తామని, అలాంటిది ఎంజీఆర్ లాంటి వ్యక్తి గురించి అలా మాట్లాడటం సరి కాదని అన్నాడు. విమర్శలు ఎక్కువవుతుండటంతో రాజేంద్ర ప్రసాద్ దిగి వచ్చి క్షమాపణ చెప్పాడు.
రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగిందని భావిస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


