
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన తాజా వ్యాఖ్యలతో మళ్ళీ వివాదంలో చిక్కుకున్నారు. ఓ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశాయి. షష్టిపూర్తి సినిమా తర్వాత ఇది మరో వివాదం.
Key Points
రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఓ వేడుకలో రెచ్చిపోయారు.
నటులు కాదంబరి కిరణ్, మరికొందరిని అనుచితంగా సంబోధించారు.
ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యాయి.
నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.
రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) నటించిన లేటెస్ట్ మూవీ ‘షష్టిపూర్తి’. అర్జన, రూపేష్ చౌదరీ, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని పవన్ ప్రభ(Pawan Prabha) దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఇందులో అచ్యుత్ కుమార్, ఆనంద చక్రపాణి, చలాకీ చంటి, మురళీధర్ గౌడ్(Muralidhar Goud), సంజయ్ స్వరూప్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ మే 30న థియేటర్స్‌లో విడుదలై హిట్‌గా నిలిచింది. అయితే గత కొద్ది కాలంగా రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆయనపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ తన తప్పేం లేదన్నట్లు మాట్లాడారు.
తప్పుగా అర్థం చేసుకున్న వారికే సంస్కారం లేదని అన్నాడు. తాజాగా, ఓ ఎస్వీ కృష్టారెట్టి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ మరోసారి రెచ్చిపోయాడు. నటుడు కాదంబర్ కిరణ్‌ను ఒరే కాకి అని అన్నాడు. అంతేకాకుండా చంపేస్తాను.. సైలెన్స్‌గా ఉండండి. ఇప్పుడే వేడెక్కింది.. దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే. ఆమని కూర్చోవే.. దానిని కూడా నేను హీరోయిన్ చేశాను’’ అని అన్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు మరోసారి కాంట్రవర్సీగా మారాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు యాక్టర్స్ అన్నప్పుడు కనీస గౌరవం ఇవ్వకుండా అలా అనడం ఏంటని ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
నెటిజన్ల తీవ్ర విమర్శలు
సోషల్ మీడియాలో రచ్చ
రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. నటులకు గౌరవం ఇవ్వాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


