|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rajendra Prasad: షాకింగ్ స్టేట్‌మెంట్.. మాట నిలబెట్టుకుంటారా?

Published: 03-11-2025, 5:27 AM
Rajendra Prasad: షాకింగ్ స్టేట్‌మెంట్.. మాట నిలబెట్టుకుంటారా?

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఫ్లాప్ కావడంతో, ‘ఇండస్ట్రీ వదిలేస్తా’ అన్న తన మాటను నిలబెట్టుకుంటారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన సెలబ్రిటీల ప్రకటనలపై కొత్త చర్చకు దారితీసింది.

Key Points

1

రాజేంద్ర ప్రసాద్ 'మాస్ జాతర' నెక్స్ట్ లెవల్ అంటూ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు.

2

సినిమా ఫ్లాప్ అవ్వడంతో 'ఇండస్ట్రీ వదిలేస్తా' అన్న తన మాట నిలబెట్టుకుంటారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

4

రవితేజ కూడా హిట్ కొడతానని చెప్పి విఫలమయ్యారు; సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడటం అవశ్యం.

రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

సినిమా సెలబ్రిటీల్లో కొందరు మైక్ అందుకోగానే నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. తమ సినిమాల గురించి ఆహా ఓహో అనే రేంజులో పొగిడేస్తుంటారు. అయితే ఇలా వర్కౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. రీసెంట్‌గా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలానే పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు.

అసలు విషయానికొస్తే ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. ‘ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుంది. చూసి షాక్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను’ అని చెప్పారు. గత శుక్రవారం సాయంత్రం షోలతో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు వీకండ్ పూర్తయిన తర్వాత ఫలితం తేలిపోయింది. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది! దీంతో పలువురు నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్‌ని మళ్లీ గుర్తుచేస్తున్నారు. మాట మీద నిలబడి ఇండస్ట్రీని వదిలేస్తారా అని కామెంట్ చేస్తున్నారు.

‘మాస్ జాతర’ ఫలితం.. నెటిజన్ల ప్రశ్నలు

ఇప్పుడే కాదు గతంలోనూ ఒకరిద్దరు యంగ్ హీరోలు ఇలానే తమ సినిమా రిలీజులకు ముందు.. హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటూ అది ఇది అని నోరుజారారు. తీరా మూవీ రిజల్ట్ తేడా కొట్టేసిన తర్వాత ఏదో కవర్ చేశారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి కవర్ డ్రైవ్స్ ఏమైనా వేస్తారా? లేదంటే సరదాకే అలా అన్నాను అని అంటారా అనేది చూడాలి?

గతంలోనూ సెలబ్రిటీల నోరు జారడం

గతంలోనూ పలు ఈవెంట్స్ సందర్భంగా అలీ, రోజా, డేవిడ్ వార్నర్‌పై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉ‍న్నాయి. ఇప్పుడిచ్చిన స్టేట్‌మెంట్‌కి సినిమాకు వచ్చిన ఫలితానికి ఏమని స్పందిస్తారో చూడాలి? మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే మాట్లాడిన హీరో రవితేజ కూడా.. గత కొన్ని మూవీస్‌తో చిరాకు పెట్టాను, ఈసారి హిట్ కొట్టబోతున్నాం అని అన్నారు. తీరా చూస్తే ‘మాస్ జాతర’.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. చూస్తుంటే సెలబ్రిటీలు.. స్టేట్‌మెంట్ ఇచ్చే విషయంలో ఆచితూచి మాట్లాడటం అవసరం అనిపిస్తుంది.

మొత్తం మీద, రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు, ‘మాస్ జాతర’ ఫలితం సెలబ్రిటీలకు ఒక గుణపాఠం. పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. తమ మాటలకు జవాబుదారీగా ఉండటం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.