|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూపర్ హిట్ దర్శకుడితో రజినీకాంత్ భారీ ప్రాజెక్ట్.. కాంబో అదుర్స్ అంటున్న నెటిజన్లు

Published: 14-07-2025, 7:17 AM
సూపర్ హిట్ దర్శకుడితో రజినీకాంత్ భారీ ప్రాజెక్ట్.. కాంబో అదుర్స్ అంటున్న నెటిజన్లు

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే మరో కొత్త సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాను సూపర్ హిట్ దర్శకుడు నిథిలన్ స్వామినాధన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ కాంబో అభిమానులను ఆకట్టుకుంటోంది.

Key Points

1

రజినీకాంత్ త్వరలోనే కొత్త సినిమాలో నటించనున్నారు.

2

ఈ సినిమాను 'మహారాజా' సినిమా దర్శకుడు నిథిలన్ స్వామినాధన్ దర్శకత్వం వహించనున్నారు.

4

రజినీకాంత్ ఈ సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు.

రజినీకాంత్ కొత్త సినిమా

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. త్వరలో ‘కూలీ’ (coolie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ బ్యూటీ పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో మెరవనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. రజినీకాంత్ జైలర్-2 షూటింగ్‌లో పాల్గొంటూనే మరికొన్ని సినిమాలు సెట్ చేసే పనిలో ఉన్నాడు.

తాజాగా, సూపర్ స్టార్ ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిథిలన్ స్వామినాధన్‌(Nithilan Swaminathan)తో ఓ మూవీ చేయబోతున్నట్లు టాక్. నిథిలన్ సూపర్ స్టార్‌ను కలిసి ఓ కథ చెప్పగా ఆయనకు నచ్చడంతో ఒకే చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఇంతకు ముందెన్నడూ తీసుకోనటువంటి రెమ్యునరేషన్ ఈ సినిమాకు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కాంబో అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

నిథిలన్ స్వామినాధన్ దర్శకత్వం

అత్యధిక రెమ్యునరేషన్

రజినీకాంత్ మరియు నిథిలన్ స్వామినాధన్ కాంబినేషన్‌తో తెరకెక్కే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.