|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

37 ఏళ్ల నిరీక్షణకు తెర: రజనీకాంత్ సినిమా విడుదల వెనుక అసలు కథ!

Published: 24-01-2026, 4:35 AM
37 ఏళ్ల నిరీక్షణకు తెర: రజనీకాంత్ సినిమా విడుదల వెనుక అసలు కథ!
  • రజనీకాంత్ నటించిన ‘హమ్ మీన్ షాహేన్ షా కౌన్’ చిత్రం 37 ఏళ్ల తర్వాత విడుదల కానుంది.
  • ఈ సినిమా 1989లోనే పూర్తయినా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.
  • 4K టెక్నాలజీతో, ఏఐని ఉపయోగించి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
  • నిర్మాత రాజా రాయ్ వ్యక్తిగత కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఒకప్పటి సినిమా దాదాపు 37 ఏళ్ల తర్వాత విడుదల కానుంది. 1989లో షూటింగ్ పూర్తయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు 4K టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

37 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న రజనీకాంత్ చిత్రం

Rajinikanth:సాధారణంగా కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని.. విడుదల కావాల్సిన సమయంలో కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడుతూ ఉంటాయి. కానీ అనుకోని సందర్భాలలో మళ్ళీ సడన్గా థియేటర్లలోకి వస్తే మాత్రం అభిమానులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో హీరో విశాల్ (Vishal) హీరోగా నటించిన ‘మదగజ రాజా’ ఏకంగా 12 ఏళ్ల తర్వాత విడుదలై థియేటర్లలో మంచి విజయం సాధించింది . అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా దాదాపు 37 ఏళ్ల క్రితం నటించిన ఒక సినిమా విడుదలకు నోచుకోలేదు. కానీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ చిత్రం ఏమిటి? ఎందుకు ఇన్ని రోజులు ఆగిపోయింది? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

1989లోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక బాలీవుడ్ యాక్షన్ ఫిలింలో నటించారు . షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది ఆ సినిమా.. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా తెరపైకి రాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా 4K టెక్నాలజీతో.. ఏఐ ని ఉపయోగించి థియేటర్లలోకి రావడానికి సిద్ధమయ్యింది ముఖ్యంగా టాప్ స్టార్ లందరూ ఇందులోనే నటించారు. మరి అలాంటి ఈ సినిమా విడుదలకు ఇన్నేళ్లు పట్టడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి ఆ చిత్రం ఏదో కాదు “హమ్ మీన్ షాహేన్ షా కౌన్”. ప్రముఖ నిర్మాత రాజా రాయ్ అప్పట్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రజినీకాంత్ తో పాటు హేమమాలిని, అనితా రాజ్ , ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా, శత్రుజ్ఞ సిన్హా, అమ్రీష్ పూరి, జగదీప్ లాంటి తదితరులు నటించారు.

సినిమా విడుదల ఆలస్యం కావడానికి కారణాలు

ఇక్కడ మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన హర్మేష్ మల్హోత్రాతో పాటు విలక్షణ నటుడు అమ్రిష్ పూరి , హాస్యనటుడు జగదీప్, కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వంటి దిగ్గజాలు మన మధ్య లేకపోవడం గమనార్హం.ఇకపోతే దాదాపు 37 ఏళ్లుగా వాయిదా పడ్డ ఈ సినిమా ఎందుకు విడుదల కాలేదనే విషయానికి వస్తే..వ్యక్తిగత కారణాలే అని తెలుస్తోంది.నిర్మాత రాజా రాయ్ తన వ్యాపార పనిపై లండన్ వెళ్లిపోయారట. అక్కడ ఆయన చిన్న కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతోనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆయన ఆ సినిమాను మళ్ళీ పట్టించుకోలేదు. అయితే కొంతకాలం ఆ బాధలోనే ఉన్న ఆయన మళ్లీ సినిమాను విడుదల చేద్దామని అనుకుంటున్న సమయంలో దర్శకుడు హర్మేశ్ మల్హోత్రా కన్నుమూశారు. అదొక విషాదఘటన.ఇలా వరుసగా విషాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

4K టెక్నాలజీతో విడుదల కానున్న సినిమా

ఇక ఇన్నేళ్ళకు సహ నిర్మాత అస్లాం మిర్జా సహాయంతో పిక్చర్ క్వాలిటీ కోసం 4k టెక్నాలజీని.. ఆడియో నాణ్యత కోసం ఏ ఐ టెక్నాలజీని ఉపయోగించి కథలో మార్పులు చేయకుండా ఆ కాలంనాటి కలర్ విజువల్స్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన అఫీషియల్ డేట్ ను కూడా త్వరలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇన్నేళ్ల తర్వాత రజనీకాంత్ నటించిన ఈ సినిమా విడుదల కాబోతుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఇక అలాగే మరొకవైపు రజినీకాంత్ జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమలహాసన్ నిర్మిస్తున్న తలైవార్ 176 సినిమా షూటింగ్లో బిజీగా కానున్నారు.

మొత్తానికి రజనీకాంత్ సినిమా ఇన్నేళ్ల తర్వాత విడుదలవుతుండటం ఆయన అభిమానులకు ఒక పండుగలాంటి వార్త. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.