|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివరాత్రి వేళ రజనీకాంత్ పోస్టర్‌కు పాలాభిషేకం! అభిమానం హద్దే దాటిందా?

Published: 14-02-2026, 10:05 AM
శివరాత్రి వేళ రజనీకాంత్ పోస్టర్‌కు పాలాభిషేకం! అభిమానం హద్దే దాటిందా?
  • మధురైలో రజనీకాంత్ శివుడి వేషధారణ పోస్టర్‌కు కార్తీక్ అనే అభిమాని పాలాభిషేకం.
  • గత మూడు సంవత్సరాలుగా శివరాత్రికి రజనీకాంత్ పోస్టర్‌కు ప్రత్యేక పూజలు చేస్తున్న కార్తీక్.
  • రజనీకాంత్ అభిమానంపై కొందరు ప్రశంసలు, మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
  • కూలీ సినిమాతో రజనీకాంత్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ కు అభిమానులు ఉండటం సహజం. అయితే, ఒక అభిమాని శివరాత్రి సందర్భంగా రజనీకాంత్ పోస్టర్‌కు పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

రజనీకాంత్ పోస్టర్‌కు పాలాభిషేకం చేసిన అభిమాని

Rajinikanth: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంతోమంది అభిమానులు ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా కొన్ని సందర్భాలలో హీరోల పట్ల ఫ్యాన్స్ చూపించే అభిమానం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇక అభిమానులు తమ హీరోల పుట్టిన రోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే వారి సినిమాలు విడుదల అవుతుంటే పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తారు అయితే కొంతమంది మాత్రం ఒక అడుగు ముందుకు వేసి హీరో హీరోయిన్లకు ఇటీవల గుడి కట్టి ప్రత్యేకంగా పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న నటుడు రజనీకాంత్ కు కూడా ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించి అభిమానులు పూజలు చేస్తున్నారు.

ఇకపోతే శివరాత్రి పండుగ రావడంతో ఒక అభిమాని వినూత్న రీతిలో రజనీకాంత్ పోస్టర్ కు పాలాభిషేకాలు చేసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మధురైకి చెందిన కార్తీక్ అనే అభిమాని మహాశివరాత్రి పండుగ సందర్భంగా ‘ఘరానా కూలి’ సినిమాలో రజనీకాంత్ శివుడి వేషధారణలో ఉన్న ఫోటోకి పాలు పెరుగు నీటితో అభిషేకం చేశారు అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించి హారతులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మూడు సంవత్సరాలుగా ప్రత్యేక పూజలు

ఇకపోతే కార్తీక్ గత మూడు సంవత్సరాల నుంచి శివరాత్రి పండుగ సందర్భంగా ఈ ఫోటోకి ఇలాగే అభిషేకాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఫోటోకి కొంత ప్రాంతాన్ని కేటాయించి అక్కడ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో, హీరోల పట్ల అభిమానం ఉండాలి కానీ మరి ఇలాంటి అభిమానం కాదు అంటూ కొంతమంది కామెంట్లు చేయడం మరికొందరు ఈయన అభిమానం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తమిళనాడులోని పలు ప్రాంతాలలో రజనీకాంత్ కు ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించి ఆ ఆలయాన్ని ఆయన నటించిన సినిమా ఫోటోలతో నింపి ప్రత్యేకంగా పూజలు చేస్తున్న ఘటనలను ఇదివరకు చూసాము.

తాజాగా శివుడి వేషధారణలో ఉన్న రజనీకాంత్ పోస్టర్ కు పూజలు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఈయన కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో కాకపోయినా పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేయడమే కాకుండా కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్ లో మరో సినిమా కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన

రజనీకాంత్ అభిమానులు ఆయనపై తమకున్న ప్రేమను వివిధ రకాలుగా చాటుకుంటున్నారు. అయితే, ఈ విధమైన అభిమానం హద్దులు దాటుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.