|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?

Published: 12-12-2025, 6:48 AM
Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
  • రజినీకాంత్ వయసు 75 ఏళ్లు; 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 171 సినిమాలు.
  • ఆయన నెక్ట్స్ ‘జైలర్ 2’, ‘కూలీ 2’, ‘తలైవా 173’ సినిమాల్లో నటించనున్నారు.
  • మూడు సినిమాల తర్వాత రజినీకాంత్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని పుకార్లు వైరల్.
  • రజినీకాంత్ ఈ రిటైర్మెంట్ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సూపర్ స్టార్ రజినీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నా, సినిమాల్లో చురుగ్గా ఉన్నారు. ఆయన రాబోయే మూడు సినిమాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్లలో నిజమెంత, ఆయన సినీ ప్రస్థానం ఏమిటి, రాబోయే ప్రాజెక్టులు ఏంటో చూద్దాం.

రజినీకాంత్ సినీ ప్రస్థానం, వయసు

సూపర్‌స్టార్ రజినీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1950లో పుట్టిన రజినీకాంత్‌కు నటన ప్రయాణం అంత సులువుగా సాగలేదు. చాలా కష్టపడ్డాక మొదటి పాత్ర దొరికింది. అది కూడా ఒక అతిధి పాత్రే. మొదటి సినిమాలో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించారు తలైవా.

రజినీకాంత్ సౌత్ ఇండియన్ కాదు, మరాఠీ కుటుంబానికి చెందినవారు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. సినిమాల కోసం తన పేరు రజినీకాంత్ గా మార్చుకున్నారు. కర్నాటకలో బస్ కండెక్టర్ గా పనిచేసిన రజినీకాంత్.. సినిమాల మీద ప్రేమతో చెన్నై చేరారు. తన స్నేహితుడి సహాయంతో అక్కడే ఉంటు.. అవకాశాల కోసం తిరిగారు. బాలచందర్ అవకాశాలు ఇవ్వడంతో.. అంచలంచలుగా ఎదుగుతూ.. సూపర్ స్టార్ రేంజ్ కు చేరుకున్నారు.

రాబోయే మూడు సినిమాలు, విడుదల వివరాలు

రజినీకాంత్ 75 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో చురుగ్గా ఉన్నారు. ఆయన నెక్ట్స్ మూడు  సినిమాలతో సందడి చేయబోతున్నారు. ఈ జాబితాలో  ఒకటి జైలర్ 2, ఈ సినిమా  షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్  చేస్తున్న ఈమూవీ జైలర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇది 2026లో విడుదల అవుతుంది. ఇది కాకుండా కూలీ 2, తలైవా 173లో కూడా రజినీకాంత్ కనిపించబోతున్నారు.  ఈ సినిమాలు 2027 నాటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

రజినీకాంత్ తన 5 దశాబ్దాల కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 171 సినిమాల్లో నటించారు. ఆయన మొదటి సినిమా 1975లో కె. బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన.  ‘అపూర్వ రాగంగళ్’. ఈసినిమా హిట్ తరువాత సూపర్ స్టార్ తిరిగి చూసుకోలేదు. అయితే తాజాగా ఆయన రిటైర్మెంట్ పకటించబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.  ఈ విషయంపై రజినీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ నెట్టింట మాత్రం రజినీకాంత్ రాబోయే మూడు సినిమాల తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

రిటైర్మెంట్ వార్తల్లో నిజమెంత?

రజినీకాంత్ తమిళంలో మాత్రమే కాదు.. తెలుగు, యలయాళ, హిందీ భాషల్లో కూడా చాలా సినిమాలు చేశారు. తెలుగులో మాత్రం డబ్బింగ్ సినిమాలతోనే ఎక్కువగా అభిమానులను ఆయన సాధించారు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. 1983లో వచ్చిన ‘అంధా కానూన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో హేమ మాలిని, అమితాబ్ బచ్చన్, రీనా రాయ్, ప్రేమ్ చోప్రా, డానీ, ప్రాణ్ ప్రధాన పాత్రల్లో ఉన్నారు. 2.5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 7.5 కోట్ల వ్యాపారం చేసింది.

రజినీకాంత్ మూండ్రు ముగం (1982), అంధా కానూన్ (1983), నల్లవనుక్కు నల్లవన్ (1984), గిరఫ్తార్ (1985), పడిక్కదవన్ (1985), మిస్టర్ భరత్ (1986), దోస్తీ దుష్మనీ (1986), వేలైక్కారన్ (1987), మనితన్ (1987), ధర్మతిన్ తలైవన్ (1988), కబాలి (2016), కాలా (2018), జైలర్ (2023), లాల్ సలామ్ (2024), కూలీ (2025) లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు.

రజినీకాంత్ రిటైర్మెంట్ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నప్పటికీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఆయన అభిమానులు రాబోయే సినిమాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజం త్వరలో తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.