|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rajinikanth : అప్పుడు కొడుకుగా నటించి.. ఇప్పుడు రజినీకాంత్ తోనే వార్ కి సిద్దమైన హీరో..

Published: 13-08-2025, 5:21 AM
Rajinikanth : అప్పుడు కొడుకుగా నటించి.. ఇప్పుడు రజినీకాంత్ తోనే వార్ కి సిద్దమైన హీరో..

ఆగస్టు 14న రజినీకాంత్ ‘కూలీ’ మరియు హృతిక్ రోషన్ ‘వార్ 2’ సినిమాలు విడుదలవుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హృతిక్ చిన్నప్పుడు రజినీకాంత్ సినిమాలో నటించాడు. ఇప్పుడు వారు పోటీగా ఉన్నారు.

Key Points

1

రజినీకాంత్ కూలీ సినిమా ఆగస్టు 14న విడుదలవుతోంది.

2

అదే రోజు హృతిక్ రోషన్ నటించిన వార్ 2 కూడా విడుదలవుతోంది.

4

హృతిక్ రోషన్ తన ట్వీట్ ద్వారా రజినీకాంత్ ను అభినందించాడు.

రజినీకాంత్ కూలీ, వార్ 2 సినిమాల విడుదల

Rajinikanth : రజినీకాంత్ కూలీ సినిమా రేపు ఆగస్టు 14న రిలీజ్ కానుంది. అలాగే రేపు ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2 కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా హృతిక్ రోషన్ స్పెషల్ ట్వీట్ వేసాడు.

హృతిక్ రోషన్ తన ట్వీట్ లో.. మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరొకరు. సినిమాల్లో 50వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు అని రజినీకాంత్ గురించి తెలిపాడు.

హృతిక్ రోషన్ యొక్క ట్వీట్

రజినీకాంత్ గతంలో హిందీలో కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ – శ్రీదేవి జంటగా బాలీవుడ్ లో 1986 లో భగవాన్ దాదా అనే సినిమా చేసాడు. రాకేష్ రోషన్ నిర్మాణంలో ఓం ప్రకాష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రజినీకాంత్ కొడుకుగా హృతిక్ రోషన్ చిన్నప్పుడే నటించాడు. ఇప్పుడు 39 ఏళ్ళ తర్వాత తండ్రిగా నటించిన రజినీకాంత్ సినిమాకు పోటీగా తన వార్ 2 సినిమాతో వస్తున్నాడు హృతిక్.

హృతిక్ రోషన్ మరియు రజినీకాంత్ మధ్య సంబంధం

ఈ క్రమంలో హృతిక్ రోషన్ రజినీకాంత్ తో పనిచేసిన రోజులను గుర్తుచేసుకొని ఇలా ట్వీట్ చేయడం గమనార్హం.

చిన్నప్పుడు రజినీకాంత్ సినిమాలో నటించిన హృతిక్ రోషన్, ఇప్పుడు తన సినిమాతో పోటీ పడుతున్నాడు. రెండు సినిమాల విజయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.