|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రూ.5 వేల టోస్టర్ కోసం ఇంత డ్రామానా? నెట్‌ఫ్లిక్స్‌లో రాజ్ కుమార్ రావ్ మూవీ రచ్చ!

Published: 26-03-2026, 6:05 AM
షాకింగ్: రూ.5 వేల టోస్టర్ కోసం ఇంత డ్రామానా? నెట్‌ఫ్లిక్స్‌లో రాజ్ కుమార్ రావ్ మూవీ రచ్చ!
  • రాజ్ కుమార్ రావ్, సాన్యా మల్హోత్రా జంటగా ‘టోస్టర్’ మూవీ ఏప్రిల్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల!
  • వివేక్ దాస్ చౌదరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ డార్క్ కామెడీలో అర్చన పూరన్ సింగ్ కీలక పాత్ర!
  • ఆగిపోయిన పెళ్లి.. గిఫ్ట్‌గా ఇచ్చిన టోస్టర్‌ను వెనక్కి తీసుకోవాలని హీరో ప్రయత్నం.. అసలు కథ ఇక్కడే మొదలు!
  • ఈ సినిమాలో అభిషేక్ బెనర్జీ స్పెషల్ క్యామియో అదుర్స్ అంతే! కామెడీ టైమింగ్‌తో అదరగొట్టనున్న నటీనటులు!

నెట్‌ఫ్లిక్స్‌లో రాజ్ కుమార్ రావ్ తన ‘టోస్టర్’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఒక చిన్న టోస్టర్ చుట్టూ అల్లుకున్న కథలో కామెడీ, డ్రామా, సస్పెన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే ఏప్రిల్ 15 వరకు ఆగాల్సిందే!

టోస్టర్ వెనుక అసలు కథేంటి?

Netflix Movie: నెట్‌ఫ్లిక్స్ లోకి ఓ సూపర్ ఫన్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు టోస్టర్. ఈ సినిమా ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతూ నెట్‌ఫ్లిక్స్ ఓ ఫన్నీ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేసింది.

పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు సరదాగా బహుమతులు ఇచ్చి రావడం మనందరికీ అలవాటే. కానీ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆ పెళ్లి కాస్తా ఆగిపోతే.. ఆ ఇచ్చిన బహుమతిని ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని ఎవరైనా పట్టుబడితే ఎలా ఉంటుంది? వినడానికే చాలా క్రేజీగా ఉంది కదా. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో నెట్‌ఫ్లిక్స్ మన ముందుకు ‘టోస్టర్’ అనే ఒక ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ సినిమాను తీసుకురాబోతోంది. ఏప్రిల్ 15, 2026న స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాలో.. మనం రోజూ ఇంట్లో వాడే ఒక చిన్న వస్తువు చుట్టూ ఎలాంటి ఊహించని సంఘటనలు జరిగాయన్నది చాలా ఫన్నీగా చూపించబోతున్నారు.

టోస్టర్ సినిమా ఓటీటీ వివరాలు ఇవే

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

స్ట్రీమింగ్ తేదీ: ఏప్రిల్ 15, 2026

రాజ్ కుమార్ రావ్ మ్యాజిక్ ఎలా ఉండబోతోంది?

దర్శకుడు: వివేక్ దాస్ చౌదరి

నటీనటులు: రాజ్‌కుమార్ రావ్, సాన్యా మల్హోత్రా, అర్చన పూరన్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఫరా ఖాన్, సీమా పహ్వా తదితరులు.

టోస్టర్.. అసలు ఈ మహా కంజూస్ కథేంటి?

అయితే ఆ పెళ్లి ఆగిపోవడంతో తను ఇచ్చిన టోస్టర్‌ను ఎలాగైనా తిరిగి లాక్కోవాలని రమాకాంత్ పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ఆ చిన్న వస్తువు కోసం అతను చేసే ప్రయత్నాలు చివరికి ఊహించని మర్డర్ మిస్టరీలు, ప్రమాదాలు, దాగి ఉన్న రహస్యాలు బయటపడే స్థాయికి వెళ్తాయి.

ఏప్రిల్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో టోస్టర్ రచ్చ

ప్రోమో వీడియోలో రాజ్‌కుమార్ రావ్ మ్యాజిక్..

అంతేకాదు తాను మోనోలాగ్స్ చెప్పనని మొండికేస్తూనే సినిమా పేరు, నటీనటులు, ఏప్రిల్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అనే డీటెయిల్స్ అన్నీ ఆడియన్స్‌కు చెప్పేస్తాడు. ఇందులో తన క్యారెక్టర్ పేరు ఆర్కే.. అంటే రాజ్‌కుమార్ కాదు, రమాకాంత్ అని చాలా ఫన్నీగా ఇంట్రడ్యూస్ చేశాడు.

నిర్మాతగా మారుతున్న నటి పత్రలేఖ..

లూడో, హిట్ ద ఫస్ట్ కేస్ లాంటి సినిమాల తర్వాత రాజ్‌కుమార్, సాన్యా మల్హోత్రా మళ్లీ ఈ సినిమా కోసం జతకట్టారు. వివేక్ దాస్ చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అర్చన పూరన్ సింగ్, ఫరా ఖాన్ లాంటి సీనియర్లు తమదైన టైమింగ్‌తో నవ్వించబోతున్నారు. స్త్రీ సినిమాలో రాజ్‌కుమార్‌తో కలిసి అదరగొట్టిన అభిషేక్ బెనర్జీ కూడా ఇందులో ఒక స్పెషల్ క్యామియో చేస్తున్నాడు. మొత్తానికి ఏప్రిల్ 15న నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతున్న ఈ డార్క్ కామెడీ మర్డర్ మిస్టరీ కచ్చితంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొత్తానికి రాజ్ కుమార్ రావ్ ‘టోస్టర్’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.