|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sridevi : శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్న రజినీకాంత్.. కమల్ కిఇచ్చి పెళ్లి చేయాలనుకున్న శ్రీదేవి తల్లి..

Published: 05-08-2025, 9:19 PM
Sridevi : శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్న రజినీకాంత్.. కమల్ కిఇచ్చి పెళ్లి చేయాలనుకున్న శ్రీదేవి తల్లి..

ప్రముఖ నటి శ్రీదేవి జీవితంలో రజినీకాంత్, కమల్ హాసన్ ల పాత్రలు ఎంతో ఆసక్తికరమైనవి. రజినీకాంత్ ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడు, శ్రీదేవి తల్లి కమల్ హాసన్ తో పెళ్లి చేయాలని కోరుకుంది. కానీ…

Key Points

1

రజినీకాంత్ శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్నారు, కానీ గృహప్రవేశ సమయంలో కరెంట్ పోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.

2

శ్రీదేవి తల్లి ఆమెను కమల్ హాసన్‌తో పెళ్లి చేయాలని కోరుకున్నారు.

4

శ్రీదేవి చివరకు బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు.

రజినీకాంత్ ప్రేమ ప్రకటన

Sridevi : అతిలోక సుందరి శ్రీదేవిని అభిమానులతో పాటు చాలా మంది వివిధ రంగాల ప్రముఖులు ఆమెని ఆరాధించేవాళ్ళు. ఆమె కూడా పలువురితో ప్రేమలో ఉందని వార్తలు వచ్చినా చివరకు బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది. అయితే ఒకానొక సమయంలో శ్రీదేవికి సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రపోజ్ చేయాలనుకున్నాడట. మరోవైపు శ్రీదేవి తల్లి ఆమెను కమల్ హాసన్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుందట.

శ్రీదేవి రజినీకాంత్ తో దాదాపు 10 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఆమె కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు స్టార్స్ అందర్నీ గృహ ప్రవేశానికి పిలిచారు. రజినీకాంత్ కూడా ఆ గృహప్రవేశానికి హాజరయ్యారు. తన ప్రేమను చెప్పడానికి అదే మంచి సమయం అని భావించి శ్రీదేవికి అప్పుడు ప్రపోజ్ చేయాలనుకున్నాడట రజినీ. కానీ రజినీ కొత్తింట్లోకి అడుగుపెట్టగానే కరెంట్ పోయిందట. ఇల్లంతా చీకటిగా అయిందట. దీంతో ఇది మంచి శకునం కాదని భావించి శ్రీదేవితో ఏం మాట్లాడకుండానే రజినీ బయటకు వచ్చేశారట. ఆ తర్వాత కూడా రజినీ శ్రీదేవితో కలిసి నటించారు. ఈ విషయాన్ని దర్శకుడు బాలచందర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

కమల్ హాసన్ తో పెళ్లి ప్రతిపాదన

Also See : NTR Special Photo Shoot : ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోలు చూశారా..? స్టైలిష్ లుక్స్ లో..

శ్రీదేవి చివరి నిర్ణయం

ఇక మరోవైపు శ్రీదేవి తల్లి ఏమో ఆమెని కమల్ హాసన్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. కమల్ దగ్గరకు వెళ్లి శ్రీదేవిని పెళ్లి చేసుకోమని కూడా అడిగారట. కానీ కమల్ కి ఇష్టం లేక, శ్రీదేవి ఎప్పుడూ ఆ కోణంలో చూడలేదని ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. శ్రీదేవి – కమల్ కూడా అనేక సినిమాల్లో కలిసి నటించారు. అలా ఓ స్టార్ హీరో శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్నారు. మరో స్టార్ హీరోతో పెళ్లి చేయాలనుకున్నారు ఆమెకు. కానీ అవేమి జరగలేదు.

చివరకు శ్రీదేవి తన జీవిత భాగస్వామిని ఎంచుకున్న విధానం ఆసక్తికరంగా ఉంది. రజినీ, కమల్ లతో ఆమెకున్న సంబంధాలు సినిమా అభిమానులకు ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.