|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్లాస్టిక్ సర్జరీలపై నెటిజన్ షాకింగ్ ఆరోపణలు.. రకుల్ ప్రీత్ సింగ్ ఘాటు రిప్లై!

Published: 16-12-2025, 3:44 AM
ప్లాస్టిక్ సర్జరీలపై నెటిజన్ షాకింగ్ ఆరోపణలు.. రకుల్ ప్రీత్ సింగ్ ఘాటు రిప్లై!
  • తెలుగులో కెరీర్ డౌన్ అయ్యాక బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది రకుల్.
  • ‘మన్మధుడు 2’ కోసం సన్నబడటంపై అప్పట్లో తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంది.
  • ప్రస్తుత లుక్స్ పై ప్లాస్టిక్ సర్జరీలంటూ నెటిజన్ సంచలన పోస్ట్ పెట్టాడు.
  • రకుల్ సీరియస్: నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ స్పందన.

టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు షిఫ్ట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ లుక్స్ పై సంచలనం రేగింది. ప్లాస్టిక్ సర్జరీల కారణంగానే ఆమె శరీరంలో మార్పులు వచ్చాయంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా, దీనిపై రకుల్ ఘాటుగా స్పందించింది. అసలు విషయాలు తెలియకుండా ప్రచారం చేయొద్దంటూ బ్యూటీ సీరియస్ అయ్యింది.

రకుల్ కెరీర్, సన్నబడటం వెనుక రహస్యం

Rakul Preeth Singh: నార్త్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ బ్యూటీ. కానీ, ఒక్కసారిగా ఆమె కెరీర్ డౌన్ అయిపొయింది. తెలుగులో ఆమె చేసిన చివరి సినిమా నాగార్జునతో మన్మధుడు 2. అంతమందు ముందు కాస్త బొద్దుగా, క్యూట్ గా కనిపించిన రకుల్ మన్మధుడు సినిమా కోసం చాలా సన్నబడింది. కానీ, ఆ లుక్ ఆమెకు అంతగా సెట్ కాలేదు. నిజానికి ఆమెను అలా చూసి చాలా మంది షాక్ అయ్యారు. అసలు రకుల్(Rakul Preeth Singh) కు ఏమయ్యింది? ఎందుకు అలా సన్నబడింది అంటూ చాలా ట్రోలింగ్స్ నడిచాయి.

ప్లాస్టిక్ సర్జరీలపై నెటిజన్ సంచలన పోస్ట్

Yukti Thareja: స్పోర్ట్స్ డ్రెస్ లో గ్లామర్ పీక్స్.. కె ర్యాంప్ బ్యూటీ హాట్ అందాలు.. ఫోటోలు

ఆరోపణలపై రకుల్ ప్రీత్ సింగ్ ఘాటు స్పందన

కానీ, ఆమె అవేవి పట్టించుకోకుండా టాలీవుడ్ లో సినిమాలు మానేసి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది. రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకుంది. అయితే, తాజాగా రకుల్ ప్రెజెంట్ లుక్ పై ఒక నెటిజన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె శరీర మార్పులకు కారణం ప్లాస్టిక్ సర్జరీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే, ఆ పోస్ట్ రకుల్ వరకు చేరడంతో సీరియస్ అయ్యింది ఈ బ్యూటీ. “నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు జనాలను తప్పు దారి పట్టిస్తూ ఉంటారు. ఇది నిజంగా భయంకరమైన పని. సంప్రదాయ వైద్యం, ఆధునిక చికిత్స.. నేను రెండిటినీ నమ్ముతాను. ఒకవేళ ఎవరైనా సర్జరీలు చేయించుకున్నా దానిని తప్పు పట్టను. కానీ, వ్యాయామం చేసి కూడా బరువు తగ్గొచ్చు.. అది గుర్తుపెట్టుకోవాలి. అంటూ సీరియస్ గా రెస్పాండ్ అయ్యింది. దీంతో రకుల్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

రకుల్ తన ఫిట్నెస్, సర్జరీలపై స్పష్టతనిచ్చినప్పటికీ, నెటిజన్ల ఆరోపణలు, ఆమె స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై ఇటువంటి పోస్టులు నిత్యం చర్చనీయాంశమవుతూనే ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.