
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన తాజా ఫోటోషూట్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఆమె అందాలు ఆవిష్కరించి, నెటిజన్లను ఆకట్టుకుంది. ఫైర్ ఎమోజీలతో ఆమె అందాన్ని ప్రశంసిస్తున్నారు.
Key Points
రకుల్ ప్రీత్ సింగ్ తన హాట్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటోంది.
స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఆమె అందాలు ఆవిష్కరించింది.
నెటిజన్లు ఫైర్ ఎమోజీలతో ఆమె అందాన్ని ప్రశంసిస్తున్నారు.
పెళ్లయినా సరే రకుల్ సినిమాల్లో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కెరటం’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (Venkatadri Express)చిత్రంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుని స్టార్ బ్యూటీగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్స్ హీరోలందరి సరసన నటించిన ఆమె ఎంతోమంది అభిమానులకు దక్కించుకుంది. ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న రకుల్ కొద్ది కాలంగా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక గత ఏడాది ‘అయలాన్’(Ayalaan) మూవీతో హిట్ సాధించింది. ఇక ఇటీవల ఓ హిందీ సినిమాలో నటించి మెప్పించింది. గత కొద్ది కాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న రకుల్ హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది.
నెటిజన్ల స్పందన
తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలు ఫొటోలు షేర్ చేసింది. స్లీవ్‌లెస్ బ్లాక్ డ్రెస్ ధరించిన ఆమె థైయ్స్ షో చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తోంది. మత్తెక్కించే చూపులతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ ఎంజెల్‌లా ఉన్నావని కామెంట్లు పెడుతున్నారు. కాగా, రకుల్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 2021 నుంచి జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న ఆమె గత ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా పెళ్లి చేసుకుంది. భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. వివాహం జరిగిన వెంటనే ఇండస్ట్రీకి దూరం అవుతుందని అంతా భావించారు. కానీ రకుల్ పెళ్లి అయినా సరే వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. అయితే ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ దీనిపై రకుల్ మాత్రం స్పందించడం లేదు.
రకుల్ వ్యక్తిగత జీవితం
A post shared by Rakul Singh (@rakulpreet)
చివరగా, రకుల్ ప్రీత్ సింగ్ తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో యాక్టివ్ గా ఉండడం ఆమెకు మంచి పేరు తెచ్చిపెడుతోంది.


