|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rakul Preet Singh: హైదరాబాద్‌ ఇల్లు గిఫ్ట్‌.. ఆగ్రహంతో ఊగిపోయిన రకుల్‌ తండ్రి

Published: 02-06-2025, 2:14 AM
Rakul Preet Singh: హైదరాబాద్‌ ఇల్లు గిఫ్ట్‌.. ఆగ్రహంతో ఊగిపోయిన రకుల్‌ తండ్రి

Key Points

1

రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్ అన్న వార్త వైరల్.

2

ఈ వార్తతో రకుల్ తండ్రి ఆగ్రహానికి గురయ్యారు.

3

ఇల్లు రకుల్ కష్టార్జితమని, తండ్రే రిజిస్ట్రేషన్ పనులు చూసుకున్నారని రకుల్ వివరణ.

హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్ వార్త

సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల నుంచి మొదలుపెడితే సెలబ్రిటీల పర్సనల్‌ విషయాల వరకు అన్నింటిపైనా ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్‌ తీసుకుంటే మరికొందరేమో వాటిపై స్పందించి నిజానిజాలు ప్రేక్షకులకు తెలియజేస్తుంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల రిలేషన్స్‌ గురించి ఎన్నో పుకార్లు వస్తుంటాయి. వారిచ్చిపుచ్చుకునే కానుకల గురించైతే చెప్పనక్కర్లేదు.

హైదరాబాద్‌ ఇల్లు గిఫ్ట్‌? అలా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ( Rakul Preet Singh ) గురించి కూడా ఓ గాలి వార్త అప్పట్లో బాగా వైరల్‌ అయింది. హైదరాబాద్‌లో ఆమె ఉంటున్న ఇల్లు తను సంపాదించింది కాదని, ఎవరో రాజకీయ నాయకుడు ఆమెకు కానుకగా ఇచ్చాడన్నది సదరు వార్త సారాంశం. ఈ రూమర్‌ గురించి రకుల్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. ‘హైదరాబాద్‌లోని ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్‌ ఇచ్చారన్న వార్త చూసి మా నాన్న చాలా ఆగ్రహానికి గురయ్యాడు.

రకుల్ తండ్రి ఆగ్రహం

నా కష్టార్జితం.. నిజానికి ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ పనులన్నీ నాన్నే స్వయంగా చూసుకున్నాడు. అలాంటిది ఆ ఇల్లు మా సొంతం కాదన్న వార్త చూడగానే భరించలేకపోయాడు. ఏంటిది? నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్న ఇల్లు ఎవరో బహుమతిగా ఇచ్చారని ఎలా అంటారు? అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఇలాంటి పనికిరాని పుకార్లకు మనం స్పందించాల్సిన అవసరం లేదని నచ్చజెప్పాను. నాన్నేమో.. రిప్లై ఇవ్వాల్సిందే అంటాడు. ఇలాంటి చెత్త రూమర్లను పట్టించుకోనక్కర్లేదని నాన్నను ఎలాగోలా సముదాయించాను’ అని రకుల్‌ చెప్పుకొచ్చింది.

సినిమా రకుల్‌ ప్రీత్‌.. ‘కెరటం’ సినిమాతో తెలుగులో తన ప్రయాణాన్ని ఆరంభించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, పండగ చేస్కో, కిక్‌ 2, సరైనోడు, ధృవ, రారండోయ్‌ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో.., జయ జానకి నాయక, చెక్‌, ఇండియన్‌ 2 వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్‌పైనే ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ఇండియన్‌ 3, దేదే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.

రకుల్ వివరణ

రకుల్ ప్రీత్ సింగ్ తన హైదరాబాద్ ఇంటికి సంబంధించిన గాసిప్‌కు స్పందిస్తూ, అది తన కష్టార్జితమని, తన తండ్రి ఆగ్రహానికి గురయ్యాడని వెల్లడించింది. అలాంటి పుకార్లను పట్టించుకోకూడదని ఆమె అభిప్రాయపడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.