|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు.. దసరా బుల్లోడిగా నవీన్ పొలిశెట్టి!

Published: 02-10-2025, 9:11 AM
Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు.. దసరా బుల్లోడిగా నవీన్ పొలిశెట్టి!

టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు. సినిమా విడుదల తేదీకి ముందే ప్రమోషన్స్ వేడెక్కాయి. ఇటీవలే ప్రోమో విడుదల కాగా, తాజాగా దసరా సందర్భంగా మరో ఆకట్టుకునే వీడియోను విడుదల చేశారు.

Key Points

1

నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సంక్రాంతికి రాబోతోంది.

2

సినిమా విడుదలకు మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్స్ ప్రారంభం.

4

దసరా సందర్భంగా పచ్చని పొలాల మధ్య నవీన్ పొలిశెట్టి ప్రత్యేక వీడియో రిలీజ్.

సంక్రాంతి రేసులో నవీన్ పొలిశెట్టి

టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలిచాడు. పొలిశెట్టి హీరోగా వస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju).  ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా దాదాపు మూడు నెలల సమయం ఉంది. అయినప్పటికీ ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రోమోను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది.

తాజాగా ఇవాళ దసరా కావడంతో మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో సినీ ప్రియులకు నవీన్ పొలిశెట్టి శుభాకాంక్షలు తెలిపారు. పచ్చని పొలాల మధ్య చేసిన ఈ ప్రమోషన్ వీడియో ఆడియన్స్‌ను అలరిస్తోంది.  కాగా.. ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.

అనగనగా ఒక రాజు: ప్రమోషన్స్ జోరు

దసరా స్పెషల్ వీడియో

‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. నవీన్ పొలిశెట్టి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.