|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖిల్ సంచలన వ్యాఖ్యలు: ‘ఏజెంట్’ డిజాస్టర్ పై షాకింగ్ నిజాలు!

Published: 06-07-2026, 1:41 PM
అఖిల్ సంచలన వ్యాఖ్యలు: 'ఏజెంట్' డిజాస్టర్ పై షాకింగ్ నిజాలు!
  • అఖిల్ అక్కినేని షాకింగ్ కామెంట్స్: ‘ఏజెంట్’ చెత్త సినిమా, పోతుందని ముందే అర్థమైంది!
  • కొత్త చిత్రం ‘లెనిన్’ జులై 10న విడుదల కానుంది. ఈసారి హిట్ ఖాయమని అఖిల్ ధీమా.
  • భారీ డిజాస్టర్ ‘ఏజెంట్’ నుండి గుణపాఠం నేర్చుకొని, ఇప్పుడు కొత్త ఎనర్జీతో ‘లెనిన్’ కోసం.
  • తండ్రి నాగార్జున సైతం ‘లెనిన్’ చూసి ప్రశంసించారు, భారీ హిట్ ఖాయమని ట్వీట్ చేశారు.

అక్కినేని అఖిల్ తన కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ ‘ఏజెంట్’ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ షాక్ కు గురిచేశారు. ‘లెనిన్’ ప్రమోషన్స్ లో ఆయన చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.

‘ఏజెంట్’ డిజాస్టర్ పై అఖిల్ బోల్డ్ కామెంట్స్!

అఖిల్ అక్కినేని హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో ఏదీ హిట్‌ లేదు. చాలా వరకు పరాజయం చెందినవే, కొన్ని యావరేజ్‌గా ఆడాయి. కానీ అఖిల్‌కి మాత్రం బ్రేక్‌ ఇవ్వలేకపోయాయి. దీంతో తనని తాను నిరూపించుకునేందుకు పోరాడుతూనే ఉన్నాడు అఖిల్‌. అందులో భాగంగా ఇప్పుడు `లెనిన్‌` అనే సినిమాతో వస్తున్నారు. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జులై 10న సినిమా రిలీజ్‌ కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్‌ తన ఫెయిల్యూర్స్ గురించి ఓపెన్‌ అయ్యాడు. సినిమా హిట్‌ కొట్టాలనే ప్రెజర్‌ ఉంటుందని, కానీ అది పాజిటివ్ వేలో ఉంటుందని తెలిపారు. తన గత చిత్రాలు ఆడలేదని తాను ఒప్పుకున్నాడు. ఈ విషయంలో ఎవరినీ ఛీట్‌ చేయడానికి లేదని, అది అందరికి తెలిసిందే అని చెప్పాడు అఖిల్‌. ఈ క్రమంలో గత చిత్రం `ఏజెంట్‌` గురించి ఆయన రియాక్ట్ అయ్యాడు. `ఏజెంట్‌కి అంత నెగటివిటీ రాకూడదని అనిపించిందా` అనే జర్నలిస్ట్ ప్రశ్నకి అఖిల్‌ రియాక్ట్ అయ్యాడు.

కొత్త చిత్రం ‘లెనిన్’ పై అఖిల్ భారీ నమ్మకం!

`మేం బ్యాడ్‌ ఫిల్మ్ తీశాం. సింపుల్‌గా చెప్పాలంటే అదే జరిగింది. థియేటర్‌కి వెళ్లిన ఆడియెన్స్ కి సినిమా నచ్చలేదు. డిజప్పాయింట్‌ చేసింది. ఈ మూవీ విషయంలో నేను ఎవరినీ బ్లేమ్‌ చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే అందులో నా పాత్ర కూడా ఉంటుంది, హిట్‌, ఫెయిల్యూర్‌ రెండింటినీ తీసుకోవాల్సిందే. సినిమాని రిలీజ్‌ రోజే థియేటర్లో చూశాను, నేనే డిజప్పాయింట్ అయ్యాను, అప్పుడే సినిమా పోతుందని అర్థమైంది` అని తెలిపారు అఖిల్‌.

నాగార్జున కూడా ‘లెనిన్’ పై ప్రశంసలు!

ఆ ఫెయిల్యూర్‌ని పాజిటివ్‌గా తీసుకొని, దాన్ని ఎనర్జీగా మార్చుకొని ఈ మూవీ(లెనిన్)ని చేసినట్టు తెలిపాడు. దీనిపై తనకు నమ్మకం ఉందని, సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నట్టు తెలిపారు. కచ్చితంగా ఈ సారి కొడుతున్నామనే నమ్మకాన్ని అఖిల్‌ వెల్లడించారు. నాగార్జున కూడా సినిమా చూశాడని, ఆయనకు నచ్చిందని, అందుకే ట్వీట్ పెట్టాడని చెప్పాడు. నాన్న కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు చెప్పాడు. నాగవంశీ, నాగార్జున కలిసి నిర్మించిన `లెనిన్‌` మూవీ జులై 10న విడుదల కాబోతుంది.

అఖిల్ బోల్డ్ స్టేట్‌మెంట్స్, ‘లెనిన్’ పై ఆయన నమ్మకం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈసారి హిట్ దక్కుతుందా లేదా అనేది జులై 10న తేలుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.