|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో రెజీనా ధమాకా! లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ బద్దలు!

Published: 06-07-2026, 1:41 PM
లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో రెజీనా ధమాకా! లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ బద్దలు!
  • లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో రెజీనా కసాండ్రా లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్.
  • విశాల్ వెంకట్ దర్శకత్వంలో రెజీనా నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి.
  • కథ బాగా నచ్చడంతో రెజీనా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ వర్గాల టాక్.
  • చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది, త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.

టాలీవుడ్, కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది! స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో, అందాల తార రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో ఒక పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం రాబోతోంది. ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం!

లోకేష్ కనగరాజ్ కొత్త అవతార్

‘ఖైదీ, విక్రమ్, కూలీ, లియో’ వంటి చిత్రాలతో దర్శకుడిగా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు హీరోగా కూడా అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ‘డిసి’ చిత్రం జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న లోకేశ్ కనగరాజ్.. తన తదుపరి ప్రాజెక్టుపై కూడా ఫోకస్ పెట్టినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ సారి డైరెక్టర్‌గా, హీరోగా కాకుండా నిర్మాతగా మరో సినిమాను లైన్‌లో పెట్టాడట ఈయన. ఈమేరకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన చిత్ర నిర్మాణ ప్రయాణాన్ని కొనసాగిస్తు.. ఓ లేడీఓరియెంటెడ్ మూవీకి సిద్ధం అవుతున్నాడని టాక్. ఈ సినిమాకు విశాల్ వెంకట్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ కాగా.. మహిళా ప్రధాన చిత్రం కావడంతో రెజీనా కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చెయ్యగా.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు టాక్.

రెజీనా కసాండ్రా లేడీ ఓరియెంటెడ్

షూటింగ్ మొదలు.. అధికారిక ప్రకటన

లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో రెజీనా నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో రానున్న అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.