
📌 Key Points
- రుధిర తన తాతయ్య ఇంట్లో పాత ఇనుప పెట్టెలో వింటేజ్ కెమెరాను కనుగొంది.
- తాతయ్య ఆ కెమెరాను “మ్యాజిక్ బాక్స్” అని పిలిచి, దాని చరిత్రను వివరించాడు.
- ఫిల్మ్ కెమెరాతో ఫోటోలు తీయడంలో ఉన్న ఉత్కంఠ, అనుబంధాన్ని పంచుకున్నాడు.
- డిజిటల్ యుగంలో పాతకాలపు ఛాయాగ్రహణం విశిష్టతను రుధిర ఆస్వాదించింది.
గత రాజకీయ నిర్ణయాలు, వాటి ప్రభావాలను గుర్తుచేసుకుంటూ, నేటి పాలనలో పారదర్శకత, ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో ఈ కథనం విశ్లేషిస్తుంది. పాత జ్ఞాపకాలు వర్తమానానికి ఎలా మార్గదర్శకం అవుతాయో తెలుసుకుందాం.
పాత పెట్టెలో దాగిన వింత వస్తువు
సరిగ్గా రెండు నెలలక్రితం.. సమ్మర్ హాలిడేస్ కావడంవల్ల సిటీ నుంచి సొంతూరుకు వెళ్లిన రుధిర తన నానమ్మ, తాతయ్యల ఇంట్లో ఎంతో సంతోషంగా గడుపుతోంది. సిటీలో ఉన్నప్పుడు వినిపించిన వాహనాల రణగొణ ధ్వనులకు బదులు పొలం వద్ద పచ్చని చెట్లపై పక్షుల కిల కిల రావాలు వింటూ మురిసిపోతోంది. ఇంటిముందు వేపచెట్టుపై వాలి రాగాలు తీస్తున్న కోయిల పాటల వింటూ తను కూడా కూ.. కూ.. అంటూ కోరస్ ఇస్తూ సరదాగా.. సంతోషంగా పల్లెటూరి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది.
ఆ రోజు ఎందుకో రుధిర వాళ్ల తాతయ్య తన డబ్బులు, బట్టలు, వివిధ వస్తువులు దాచుకునే పాత ఇనుప పెట్టె(సందూక)ను తెరిచి ఏదో వెతుకుతున్నాడు. రుధిర కూడా తాతయ్యా ఏం చేస్తున్నావంటూ.. పలకరిస్తూ పెట్టెలోంచి తీస్తున్న వస్తువులను పక్కన సర్దడంతో సహాయపడుతోంది. అలా చూస్తుండగా.. పాత అట్టలో దాచి ఉంచిన ఒక దృశ్యం రుధిర కంట పడింది. దానిని వింతగా చూస్తూ.. టచ్ చేస్తూ ‘తాతయ్యా ఇదేమిటి?’ అడిగింది రుధిర. ఒక్కసారిగా ఇటువైపుగా తిరిగిన వాళ్ల తాతయ్య కళ్లల్లో ఒక్కసారిగా సంతోషం ఉప్పొంగుతున్నట్లు అనిపించిది రుధరికు. అదా.. ‘ఇది ఫొటోలు తీసే మా కాలపు మ్యాజిక్ బాక్స్ లే.. మీ లాగా అప్పుడు కెమెరా ఫోన్లు ఎక్కడివి? ఇది మాత్రమే ఉండేది. ఇది మీ నానమ్మ కోరిక మేరకు కొన్నది. అందుకే భద్రంగా దాచి పెట్టా’ అంటూ ముసి ముసి నవ్వాడు రుధిర వాళ్ల తాతయ్య.
ఆ కాలపు మ్యాజిక్ బాక్స్..
తాతయ్య మ్యాజిక్ బాక్స్ కథ
ఒకప్పడు ఇప్పటిలా స్మార్ట్ ఫోన్లు ఉండేది కాదని, ఫిల్మ్ కెమెరాలు ఉండేదని విన్నది కానీ.. 14 ఏళ్ల వయసు గల రుధిర దానిని స్వయంగా చూడలేదు. ఇప్పుడు చూసే సరికి అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో తాతయ్యను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతోంది. ఆమె అడుగుతూ ఉంటుంటే.. వాళ్ల తాతయ్య పరంధామయ్యకి ఒక్కసారిగా తన పాతజ్ఞాపకాలు మదిలో మెదలసాగాయి. ఆ విషయాలను తన మనవరాలు రుధిరతో పంచుకోసాగాడు.. ‘ఇది డిజిటల్ కాదు.. అప్పట్లో నేను వాడిన పాత ఫిల్మ్ కెమెరా.. ఒక్కో ఫొటోకి ఒక్క ఫిల్మ్ ఉండేది. ఇక ఫొటో తీసిన తర్వాత అది వస్తుందో.. రాదో.. ఏమవుతుందోనని తెగ టెన్షన్ పడేవాళ్లం.. ఆ ఉత్కంఠ నీకు తెలియదు..కానీ.. మాకైతే ఇప్పటికీ గుర్తుకొస్తే ఆ రోజులు ఎంత బాగుండేనో అనిపిస్తుంది అంటూ ఫిల్మ్ కెమెరాతో ఉన్న అనుబంధాన్ని చెబుతుంటే.. రుధిర కూడా తాతయ్య జ్ఞాపకాల తాలూకు అనుభూతిని ఆస్వాదిస్తోంది.
ఫిల్టర్లు లేని ప్రేమ బంధాలు
ఫిల్మ్ కెమెరా జ్ఞాపకాలు: ఉత్కంఠ, అనుబంధం
పరంధామయ్య కెమెరాలో అప్పట్లో తీసి, ఇంకా డెవలప్ చేయని ఫిల్మ్‌లు కూడా ఉన్నాయి. మనవరాలి కోరిక మేరకు వాటిని తీసి ఆమెతోపాటు కలిసి నగరంలోని పాత స్టూడియోకు వెళ్లి ఫిల్మ్ డెవలప్ చేయించారు. ఫొటోలు వచ్చేసరికి రుధిర, పరంధామయ్య ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అవి కేవలం ఫొటోలు మాత్రమే కాదు. భావోద్వేగాలతో ముడివడిన అనుబంధాలకు ప్రతిబించాలుగా ఉన్నాయి. అందులో కేవలం మనుషులు మాత్రమే కాదు. వాళ్ల కళ్లల్లో గాఢమైన ప్రేమ, చూపుల్లో ఆప్యాయతలు, ఉమ్మడి కుటుంబంలోని ప్రేమలు కనిపించాయి. ఇప్పటి సెల్ఫీల్లా స్పష్టంగా లేకపోవచ్చు. కానీ.. ప్రతీ ఫొటోలో ఒక కథ, ఒక భావం దాగి ఉందనిపించింది. తాతా మనవరాళ్లిద్దరికీ.. అక్కడి డిజిటల్ ఫిల్టర్లు లేవు.. కానీ అవి అందించలేని మధురానుభూతులు నిండి ఉన్నాయనిపించింది రుధిరకి. తన చిన్నప్పుడు అమ్మా నాన్నా, తాతయ్య, నానమ్మ, బాబాయ్, పిన్ని అందరూ కలిసి ఉన్నరోజులు కళ్లముందు తిరిగాయి.
తాత మొహంలో సంతోషం, కళ్లల్లో ఆనందాన్ని చూస్తూ.. ఆ ‘పాత మధురాల’ గురించి ఆయన వివరిస్తుంటే వింటూ.. అలనాటి అనుభూతులు, జ్ఞాపకాల జడిలో తను కూడా తడిసిముద్దవుతున్న భావనకు లోనవుతోంది రుధిర. ఒక్క ఫిల్మ్ కెమెరా, స్వచ్ఛమైన హావ భావాలతో దర్శనమిచ్చే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలే కాదు.. అప్పట్లో పెద్దలు వాడిన అనేక వస్తువులు నేడు ఒక జ్ఞాపకంగా మిగులుతున్నాయి. వింటేజ్ సౌందర్యాలుగా విలసిల్లుతున్నాయి. ఆధునిక యువతను సైతం ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే.. ఒక్కోదాని వెనుక ఒక్కో కథ దాగుంటుంది కదా..!
పాత జ్ఞాపకాలు కేవలం వ్యక్తిగతం కావు, అవి సమాజానికి, రాజకీయాలకు కూడా పాఠాలు నేర్పుతాయి. గత అనుభవాల నుండి నేర్చుకుంటూ, మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడమే మన కర్తవ్యం.


