
📌 Key Points
- రామ్ చరణ్ బర్త్‌డేకి ‘పెద్ది’ మూవీ టీజర్ విడుదల కానుందని సమాచారం.
- సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
- క్లీంకార ఫేస్‌ను రామ్ చరణ్ బర్త్‌డేకి రివీల్ చేస్తారనే టాక్ నడుస్తోంది.
- స్వామి నాయుడు ఆధ్వర్యంలో చరణ్‌పై రూపొందించిన పాట ప్రోమోపై విమర్శలు వస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ మూవీ టీజర్ విడుదల కానుందని, సుకుమార్ సినిమా ప్రకటన ఉంటుందని సమాచారం. అయితే, స్వామి నాయుడు రూపొందించిన పాటపై విమర్శలు వస్తున్నాయి.
రామ్ చరణ్ బర్త్‌డే ట్రీట్స్!
Ram Charan Fans: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా సెలబ్రేషన్స్‌కు ప్లానింగ్స్ మొదలయ్యాయి. ఈ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ నుంచి డబుల్ ట్రీట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది’ (Peddi) మూవీ టీజర్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరొకటి, ‘పెద్ది’ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో రామ్ చరణ్ చేయబోయే సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్, షూటింగ్ మొదలయ్యే డేట్‌ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజంగా ఈ ట్రీట్స్‌తో ఫ్యాన్స్‌కు పండగ ఖాయం. మరోవైపు, ఈ బర్త్‌డేకి (Ram Charan Birthday) రామ్ చరణ్ తన కుమార్తె అయిన మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్‌ను కూడా అధికారికంగా రివీల్ చేయనున్నారనేలా కూడా టాక్ నడుస్తుంది. అదే జరిగితే.. ఫ్యాన్స్ (Ram Charan Fans) ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. అయితే వీటిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు.
ఇక మెగా సెలబ్రేషన్స్‌కు సంబంధించి స్వామి నాయుడు (Ravanam Swami Naidu) ఆధ్వర్యంలో చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో చరణ్‌పై ఆయన ఓ పాటను రెడీ చేయిస్తున్నట్లుగా చెబుతూ, పాటకు సంబంధించిన ప్రోమోని అధికారికంగా కూడా విడుదల చేశారు. ఈ ప్రోమో చూసిన వారంతా.. వెంటనే ఆ పాటను ఆపేయండి మహాప్రభో అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ‘‘నమస్కారం స్వామి నాయుడు గారు.. మీరు రామ్ చరణ్ పుట్టినరోజున అభిమానంతో చేస్తున్న సాంగ్, అభిమానులకే నచ్చలేదు. సురేష్ గారు రిలీజ్ చేసిన ప్రోమోకి ఫుల్ నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. యాంటీస్ కూడా ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ మీరు తీసుకుని పాటని రిలీజ్ చేయకుండా ఉంటారని మనవి చేస్తున్నాం’’ అని మెగా ఫ్యాన్స్ చాలా మంది సోషల్ మీడియా వేదికగా స్వామి నాయుడుకి రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.
Video Delete Cestaru Ani Doubt vachandhi Anduki Downlod cesi Petta Ecfs 😭 pic.twitter.com/GqK43fK4uH
వివాదంలో స్వామి నాయుడు పాట
— 𝐊𝐚𝐫𝐭𝐡𝐢𝐤 𝐂𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲 (@_____555KARTHIK) March 13, 2026
నిజంగా ఆ ప్రోమో అలానే ఉంది. యాంటీస్ ట్రోల్ చేయడానికి కొన్ని సాంగ్స్ సృష్టిస్తుంటారు. అలాగే ఉంది ఈ పాట. అందుకే ‘వద్దు మహాప్రభో’ అన్నవాళ్లేకానీ, అనని వారు లేరంటే నమ్మాలి. మరి స్వామి నాయుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ షాట్‌తో ‘చికిరి చికిరి’, ‘రై రై రారా’ సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. టీజర్ తర్వాత ‘పెద్ది’ రేంజే మారిపోతుందని చిత్ర యూనిట్ కూడా చెబుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది.
నమస్కారం @swaminaidu_r గారు
ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఏమిటంటే?
మీరు రామ్ చరణ్ పుట్టినరోజున అభిమానం తో చేస్తున్న సాంగ్ అభిమానులకే నచ్చలేదు సురేష్ గారు రిలీజ్ చేసిన ప్రోమో కి ఫుల్ నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
Anties కూడా ఫుల్ troll చేస్తున్నారు. ఈ feedback మీరు తీసుకుని పాటని రిలీజ్ చేయకుండా ఉంటారని మనవి..🙂🙏
— EshwaRC16 Raj(Dhfc) 🐎 (@EshwarDhfc) March 13, 2026
రామ్ చరణ్ బర్త్‌డే వేడుకల్లో పాట వివాదం నెలకొనడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ విషయంలో రామ్ చరణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.


