
📌 Key Points
- రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది – భారీ అంచనాలు!
- స్టైలిష్ ఫోటోషూట్‌తో రామ్ చరణ్ ఇంటర్నెట్‌ను షేక్ చేశారు, ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.
- బుచ్చిబాబు సన ‘మరో అవకాశం ఇవ్వండి’ అంటూ చేసిన కామెంట్ వైరల్ – మరో సినిమా ఉంటుందా?
- ‘పెద్ది’లోని పాటలకు అద్భుతమైన స్పందన – రామ్ చరణ్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూడాలంటున్న అభిమానులు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు బుచ్చిబాబు చేసిన ఒక కామెంట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు చూద్దాం!
వైరల్ అవుతున్న రామ్ చరణ్ ఫోటోషూట్
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబోలో ‘పెద్ది’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినీ వర్గాల్లో కూడా ఈ సినిమా సెన్సేషన్ సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కాబోతుంది ఈ సినిమా. గేమ్ ఛేంజర్ లాంటి ప్లాప్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బుచ్చిబాబు కామెంట్ వెనుక అసలు అర్థం ఏంటి?
ఇదిలా ఉంటే, రామ్ చరణ్(Ram Charan) ఇటీవల ‘ఎస్క్వైర్ ఇండియా’ కోసం చేసిన స్టైలిష్ ఫోటోషూట్ నెట్టింట ఎంత వైరల్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా దీనికి సంబందించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియోకి కూడా ఇంటర్నేషనల్ లెవల్లో భారీ అప్లాజ్ వచ్చింది. అయితే, ఆ వీడియోకి బుచ్చిబాబు స్పందిస్తూ.. “సార్, మరో అవకాశం ఇవ్వండి” అని సరదాగా కామెంట్ చేశారు. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన ఈ చిన్న కామెంట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
‘పెద్ది’ తర్వాత మరో సినిమా ఉంటుందా?
అంతేకాదు, ‘పెద్ది’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ ఉండబోతుందా? అనే చర్చ కూడా మొదలైంది. చరణ్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూడాలనుకుంటున్నామంటూ అభిమానులు ఈ పోస్ట్‌కు పెద్ద ఎత్తున రిప్లైలు ఇస్తున్నారు. ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంలోని సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వస్తుండటంతో, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి నిజంగా రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో మరో సినిమా సెట్ అయ్యింఅంటే ఆంటే అది సెన్సేషనే అని చెప్పాలి.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో మరో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తాం.


