|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ కి బుమ్రా షాక్? పెద్ది మూవీ వివాదం పై వైరల్ క్లారిటీ!

Published: 25-05-2026, 5:16 AM
రామ్ చరణ్ కి బుమ్రా షాక్? పెద్ది మూవీ వివాదం పై వైరల్ క్లారిటీ!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ ఈవెంట్లో బుమ్రాను ఫుట్ బాల్ ప్లేయర్ అన్నారు.
  • పొరపాటు తెలుసుకుని వెంటనే క్షమాపణలు చెప్పిన పాన్ ఇండియా స్టార్.
  • బుమ్రా కౌంటర్ ఇచ్చినట్లు వైరల్ అయిన పోస్ట్ ఫేక్ అని క్లారిటీ.
  • ‘పెద్ది’ మూవీ జూన్ 4న రిలీజ్, క్రికెట్ నేపథ్యంలో భారీ అంచనాలు.

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి! క్రికెటర్ బుమ్రాతో రామ్ చరణ్ వివాదంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్‌ల వెనుక అసలు నిజం ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ!

రామ్ చరణ్ పొరపాటు… అసలు ఏం జరిగింది?

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ పెద్ది’. ఈ సినిమా కి బుచ్చిబాబు దర్శకత్వం వహించగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్, పాటలు విడుదల కాగా.. మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా… ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. దీనిలో భాగంగా ఇటీవల భోపాల్ లో మూవీ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

అయితే, ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ పొరపాటు చేశారు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు తప్పుగా సమాధానం చెప్పారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను ఆయన ఫుట్ బాల్ ప్లేయర్ అంటూ సంభోధించడం వైరల్ గా మారింది. దీంతో అందరూ రామ్ చరణ్ ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత తాను చేసిన పొరపాటు గమనించిన చరణ్ స్పందించారు. వెంటనే క్షమాపణలు కూడా చెప్పారు.తాను పేర్లు మర్చిపోతూ ఉంటానని.. అదొక హ్యుమన్ ఎర్రర్ అని పేర్కొన్నాడు. బుమ్రా అంటే తనకు చాలా అభిమానమని… సారీ కూడా చెప్పాడు.

బుమ్రా నిజంగా కౌంటర్ ఇచ్చాడా? వైరల్ పోస్ట్ కథ!

అయితే… చరణ్.. బుమ్రాని ఫుట్ బాల్ ప్లేయర్ అని అనడంతో.. బుమ్రా హర్ట్ అయ్యి.. చరణ్ కి కౌంటర్ ఇచ్చాడంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఫోటోని షేర్ చేసి ‘ నో ప్రాబ్లం యశ్ భాయ్.. నేను నీకు పెద్ద ఫ్యాన్ ని.. మీ టాక్సిక్ మూవీ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని రాసి ఉంది. అది బుమ్రానే పోస్టు చేశాడంటూ ఆ ఫోటోని వైరల్ చేయడం మొదలుపెట్టారు. అయితే… నిజానికి అది బుమ్రా పోస్టు చేయలేదు.. ఫ్యాన్స్ అలా క్రియేట్ చేసి వైరల్ చేయడం విశేషం. బుమ్రా ఆ ఫోటో పోస్టు చేయక పోయినా రామ్ చరణ్ కి కౌంటర్ గా.. చాలా మంది మీమర్స్ ఇప్పుడు ఆ ఫోటోని వాడుతుండటం విశేషం.

‘పెద్ది’ మూవీ లేటెస్ట్ అప్డేట్స్! రిలీజ్ ఎప్పుడంటే?

ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. ఇది భారీ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించగా, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘పెద్ది’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ వివాదం సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. మరిన్ని లేటెస్ట్, ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.