
📌 Key Points
- రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించారు.
- బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు, ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్.
- రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ‘పెద్ది’ సినిమా విడుదల కానుంది.
- ఎన్టీఆర్ డ్రైవింగ్ నైపుణ్యాలను రామ్ చరణ్ ప్రశంసించారు.
రామ్ చరణ్ తన రాబోయే చిత్రం ‘పెద్ది’ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రశంసించారు. ఎన్టీఆర్ గొప్ప డ్రైవర్ అని, ఆయనతో ప్రయాణం సురక్షితమని రామ్ చరణ్ అన్నారు. ‘పెద్ది’ మూవీ మార్చి 27న విడుదల కానుంది.
రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ విజయం, గ్లోబల్ ఇమేజ్
Ram Charan:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan), రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాకుండా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచి సందడి చేశారు. అలాంటి ఈయన ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలు, టీజర్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేసాయి. ఈ సినిమా నుండి రామ్ చరణ్ హుక్ స్టెప్ తో చికిరి చికిరి అంటూ ఒక పాటను విడుదల చేశారు. ఈ పాట ఏకంగా అన్ని భాషల్లో కలుపుకొని 200 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఇక త్వరలోనే రెండవ పాటను కూడా విడుదల చేయనున్నారు . ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ సినిమా గురించి పలు విషయాలను చెబుతూనే..మరొకవైపు ఎన్టీఆర్లో దాగి ఉన్న టాలెంట్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
‘పెద్ది’ మూవీ అప్డేట్స్ ఇచ్చిన రామ్ చరణ్
రామ్ చరణ్.. ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ.. “తారక్ ఒక క్రేజీ , మ్యాడ్ డ్రైవర్.. ఎన్టీఆర్ కారు నడుపుతుంటే పక్క సీట్లో కూర్చున్న స్నేహితులు కూడా ఆ అనుభూతిని నాతో పంచుకున్నారు. ముఖ్యంగా అందరిలో కంటే తారక్ డ్రైవింగ్ లోనే నేను సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాను”అంటూ ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి గొప్పగా చెబుతూ ఆయనలోని టాలెంట్ ను బయటపెట్టారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన కామెంట్లు ఎన్టీఆర్ అభిమానులను కూడా సంతోషానికి గురి చేస్తున్నాయి.
ఎన్టీఆర్ డ్రైవింగ్ గురించి రామ్ చరణ్ కామెంట్స్
ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్ ను కూడా ఇచ్చారు. రామ్ చరణ్ మాట్లాడుతూ..” ఈ సినిమా మార్చి 27 నుండి వాయిదా పడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు. మార్చి 27వ తేదీన పెద్ది సినిమా విడుదల కాబోతోంది. అయితే మునుపెన్నడు చేయని సరికొత్త పాత్రలో ఈ సినిమాలో నేను నటించాను. ఈ సినిమా కచ్చితంగా మీకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే రామ్ చరణ్ సినిమాపై ఇచ్చిన అప్డేట్ తో పాటు తన పాత్ర పై కూడా కామెంట్లు చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.
రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులను సంతోషపరిచాయి. ‘పెద్ది’ సినిమా మార్చి 27న విడుదల కానుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.


