
📌 Key Points
- రామ్ చరణ్ ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిశారు.
- హాంగ్ కాంగ్ లో జరిగిన ఫోటోషూట్‌లో రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించారు.
- మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తన కెరీర్, క్రమశిక్షణ గురించి రామ్ చరణ్ మాట్లాడారు.
- తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి కవర్ పేజీపై కనిపించిన రామ్ చరణ్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీపై తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి స్టైలిష్ అవతార్‌లో మెరిశారు. ఈ ఫోటోషూట్ హాంగ్ కాంగ్ లో జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చరణ్
Ram Charan:గ్లోబల్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రామ్ చరణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన మొదటి సినిమా సమయంలో అసలు నటుడేనా అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తనలోని నటన విశ్వరూపాన్ని చూపిస్తూ రంగస్థలం సినిమా సమయానికి పూర్తి నటుడిగా మారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఖాతాలో మరో అరుదైన గౌరవం వచ్చి చేరింది. ఇక రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు కుక్క రైమ్ కూడా ఈ అరుదైన ఘనతను దక్కించుకోవడం గమనార్హం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Esquire ఇండియా ఏప్రిల్ 2026 మ్యాగజైన్ కవర్ పేజ్ పై స్టైలిష్ అవతార్లో మెరిసారు . హాంగ్ కాంగ్ లో జరిగిన ఈ ప్రత్యేక ఫోటోషూట్ లో సరికొత్త లుక్ లో అదరగొట్టేశారు. ముఖ్యంగా మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన కెరియర్ , క్రమశిక్షణ, కీర్తి అలాగే పెద్ది సినిమా గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.. ఇకపోతే ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఇచ్చిన ఫోటో షూట్ లో రామ్ చరణ్ గ్యాంగ్ స్టర్ లుక్కులో, ఫ్యాషన్ ఫార్వర్డ్ శైలిలో కనిపించి అందరిని మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ఈ ఫోటోలో తన పెంపుడు కుక్క రైమ్ కూడా చాలా అందంగా, స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. మొత్తానికైతే ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై స్టైలిష్ అవతారంలో తన పెట్ డాగ్ తో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు రాంచరణ్ . ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ , యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నాయి..
హాంగ్ కాంగ్ లో ప్రత్యేక ఫోటోషూట్
ఇకపోతే పెద్ది సినిమాలో ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు , గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు.. అయితే రెండు పాటల షూటింగ్ మిగిలి ఉండడం, పైగా సినిమాలో కొంత భాగం షూటింగ్ వాయిదా పడడం అలాగే వీఎఫ్ఎక్స్ వంటి కారణాలవల్ల ఈ సినిమాను మళ్ళీ జూన్ 26వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఇకపోతే ఈ సినిమా విడుదల సమయంలో రామ్ చరణ్ సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలని రామ్ చరణ్ చూస్తుంటే అటు మ్యూజిక్ డైరెక్టర్ , చిత్ర దర్శకుడు బుచ్చిబాబు మాత్రం పూర్తి పర్ఫెక్షన్తో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఎప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియాల్సి ఉంది.
వైరల్ అవుతున్న రామ్ చరణ్ ఫోటోలు
Tags Peddi Film ram charan Share
మొత్తానికి రామ్ చరణ్ తన పెంపుడు కుక్కతో కలిసి మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.


