
📌 Key Points
- రామ్ చరణ్ కంటికి గాయం, అభిమానుల్లో ఆందోళన!
- బ్యాండేజ్‌తోనే షూటింగ్‌లో పాల్గొన్న రామ్ చరణ్!
- ఫ్యాన్స్‌తో సెల్ఫీ వీడియో: క్షేమంగా ఉన్నానన్న చరణ్
- సమ్మర్ లో విడుదల కానున్న రామ్ చరణ్ కొత్త సినిమా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రామ్ చరణ్ కంటికి గాయమైంది. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కంటికి గాయమైనా షూటింగ్‌లో రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పడలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నారు. RRR లాంటి బంపర్ హిట్ సినిమా పడిన తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు చరణ్. ఇక ఇదే ఊపులో ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రామ్ చరణ్ కంటికి గాయమైన సంగతి తెలిసిందే.
అభిమానులతో రామ్ చరణ్ సెల్ఫీ వీడియో!
అయితే కంటికి చికిత్స తీసుకున్న తర్వాత లేటెస్ట్ గా పెద్ది మూవీ షూటింగ్ కు మళ్ళీ హాజరయ్యారు రామ్ చరణ్. ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా సెట్ కు వచ్చారు. తన పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో విష్ చేసేందుకు వచ్చిన ఫ్యాన్స్ ను కలిశారు రామ్ చరణ్. వారితో కలిసి సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని ఈ సందర్భంగా తెలిపారు. తన కంటికి గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వివరించారు. అయితే అభిమానులతో కలిసినప్పుడు రాంచరణ్ కంటికి బ్యాండేజ్ ఉంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
రామ్ చరణ్ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా?
A post shared by Ramcharan YuvaShakthi Nellore (@rcyuvashakthinlr)
రామ్ చరణ్ కంటికి గాయం గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. ఆయన త్వరగా కోలుకోవాలని మనమందరం కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.


