|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ఇదే లాస్ట్ అండ్ ఫైనల్.. మరోసారి తప్పుగా మాట్లాడితే ఊరుకోము’.. దిల్ రాజుకు రామ్ చరణ్ ఫ్యాన్స్ హెచ్చరిక

Published: 01-07-2025, 9:18 AM
‘ఇదే లాస్ట్ అండ్ ఫైనల్.. మరోసారి తప్పుగా మాట్లాడితే ఊరుకోము’.. దిల్ రాజుకు రామ్ చరణ్ ఫ్యాన్స్ హెచ్చరిక

గేమ్ ఛేంజర్ సినిమా నష్టాల గురించి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా ద్వారా దిల్ రాజుకు హెచ్చరిక జారీ చేశారు. ఇకపై తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Key Points

1

దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా నష్టాల గురించి పదే పదే మాట్లాడటం

2

రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజుకు హెచ్చరిక జారీ చేయడం

4

ఇకపై తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని హెచ్చరిక

దిల్ రాజు వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఆగ్రహం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), తమిళ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్(Game Changer Movie) చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైంది.. కానీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా నితిన్ హీరోగా వస్తోన్న తమ్ముడు సినిమా ప్రమోషన్స్‌లో కూడా నిర్మాతలు దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ పదే పదే గేమ్ ఛేంజర్ వల్ల చాలా నష్టపోయాం.. హీరో తమను కనీసం పట్టించుకోలేదని మాట్లాడారు. దీంతో రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌కు కోపం వచ్చింది. దీంతో నిర్మాతలను హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.

‘ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక.. సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్‌లో మీరు చేసే సినిమాలు అన్ని మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయి అని చెప్పుకొనే మీరు, ఒక సినిమా నష్ట పోయేసరికి అది అందరికీ అపాదించడం ఎంతవరకు కరెక్ట్. గతంలో మహేశ్ బాబు 1 నేనొక్కడినే సినిమా సమయంలో 14 రీల్స్ సంస్త, హీరో గురించి ఒక్కసారి అయినా మాట్లాడిందా?.. మైత్రీ బ్యానర్‌లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా, ఎవరైనా హీరోల గురించి సంభాషించారా?.. సైంధవ్ ఫెయిల్ అయ్యాక, ఆ నిర్మాత, వెంకటేశ్ గురించి ఎందుకు ఒక్క మాటైనా మాట్లాడారా?.. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా హిట్ అయితే వెంకటేశ్‌కి ఎంత ఇచ్చారు?.. ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురిచేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ ఛేంజర్ సినిమా గురించి గాని, రామ్ చరణ్ గురించి గానీ తప్పుగా మాట్లాడితే, ఇక తీవ్ర పరిణామాలు ఎదురుకోవల్సి ఉంటుంది. ఖబడ్డార్’ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ లేఖ విడుదల చేశారు.

సోషల్ మీడియాలో హెచ్చరిక

గేమ్ ఛేంజర్ సినిమా నష్టాలు

రామ్ చరణ్ ఫ్యాన్స్ హెచ్చరికతో ఈ వివాదం ముగిసే అవకాశం ఉంది. అయితే, దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి. సినిమా పరిశ్రమలో ఇలాంటి వివాదాలు సర్వసాధారణం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.