|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సెన్సేషన్: సుస్మితకు రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ వెనుక అసలు రహస్యం! దిష్టి తగలకుండా…

Published: 28-01-2026, 4:05 AM
సెన్సేషన్: సుస్మితకు రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ వెనుక అసలు రహస్యం! దిష్టి తగలకుండా...
  • సుస్మిత కొణిదెల నిర్మాతగా రాణించి, చిరంజీవితో సినిమా తీశారు.
  • ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
  • రామ్ చరణ్ తన అక్క సుస్మితకు ‘ఈవిల్ ఐ’ గిఫ్ట్ ఇచ్చారు.
  • సుస్మితకు రామ్ చరణ్ ఎప్పటి నుంచో గిఫ్ట్స్ పంపిస్తున్నారట.

మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె నిర్మించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన సోదరికి ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు.

సుస్మిత కొణిదెల సినీ ప్రస్థానం

Ram Charan: మెగా డాటర్ సుస్మిత కొణిదెల (Susmitha Konidela)నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరీర్ మొదట్లో చిన్నచిన్న వెబ్ సిరీస్ చేస్తూ అనంతరం చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ నిర్మాతగా ఎంతో మంచి అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా నిర్మాణ రంగంలో పట్టు సాధించిన తర్వాత ఈమె ఏకంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నయనతార జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాత సుస్మిత కొణిదెలకు సైతం తన తమ్ముడు రామ్ చరణ్ కూడా మంచి గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ నిర్మాతలు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుస్మిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ చరణ్ గురించి ప్రస్తావనకు వచ్చింది.

‘మన శంకర్ వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ విజయం

రామ్ చరణ్ మీకు ఎప్పుడైనా కానుకలు ఇచ్చేవాడా అంటూ ప్రశ్న ఎదురవడంతో సుస్మిత సమాధానం చెబుతూ ప్రతిసారి తనకు ఎన్నో గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటారని ఇక రాఖీ పండుగకు కూడా చాలా స్పెషల్ గిఫ్ట్స్ పంపిస్తుంటారని తెలిపారు. ఇక మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో చరణ్ నాకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారని స్వయంగా సుస్మిత తెలియజేశారు. మరి అక్కకు తమ్ముడి ఇచ్చిన ఆ బహుమతి ఏంటనే విషయానికి వస్తే.. చరణ్ కోసం ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేసాము సినిమా చూసి వచ్చిన తర్వాత చరణ్ సినిమా గురించి నాతో మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా ఉంది అక్క అంటూ సంతోషపడ్డారు.

నాన్నతో చాలా బాగా చేశావు సినిమా చాలా బాగుంది. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఇప్పుడు నీకు చాలా దిష్టి తగులుతుందని చెప్పి చరణ్ నాకు “ఈవిల్ ఐ” గిఫ్ట్ గా ఇచ్చారని సుస్మిత తెలిపారు. ఇలా ఎవరి దిష్టి తనకు తగలకుండా తన అక్కకు “ఈవిల్ ఐ” గిఫ్ట్ గా ఇచ్చారనే విషయం తెలియడంతో చరణ్ తన అక్క పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించిన తీరు అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఖరీదైన, విలాసవంతమైన కానుకలు కాకుండా తన అక్క క్షేమం గురించి ఆలోచించి చరణ్ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వటం నిజంగా గ్రేట్ అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

సుస్మితకు రామ్ చరణ్ ప్రత్యేక బహుమతి

చిరంజీవి సినిమా విజయం సాధించడంతో సుస్మిత ఆనందానికి అవధుల్లేవు. రామ్ చరణ్ తన అక్కపై చూపించిన ప్రేమ, బాధ్యత అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ బహుమతి వారి బంధాన్ని మరింత బలపరుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.