|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్‌చరణ్‌తో జోడీ?

Published: 22-09-2025, 2:21 AM
రామ్‌చరణ్‌తో జోడీ?

రామ్ చరణ్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఆర్‌సీ 17’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Key Points

1

రామ్ చరణ్ తదుపరి చిత్రం 'ఆర్‌సీ 17' లో కృతి సనన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

2

సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

4

రామ్ చరణ్ మరియు కృతి సనన్ జోడీ సినిమాలో నటించే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.

‘ఆర్‌సీ 17’ చిత్రం విశేషాలు

హీరో రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతీ సనన్‌ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే  పాన్‌ఇండియా సినిమాలో నటిస్తున్నారు రామ్‌చరణ్‌. ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్‌ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక  పాత్రలు  పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.

కృతి సనన్ – రామ్ చరణ్ జోడీ?

‘పెద్ది’ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో నటించనున్నారు రామ్‌చరణ్‌. ‘ఆర్‌సీ 17’ అన్నది వర్కింగ్‌ టైటిల్‌. ‘రంగస్థలం’(2018) వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత రామ్‌చరణ్‌–సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు సుకుమార్‌. ‘పెద్ది’ షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఏమాత్రం విరామం లేకుండా ‘ఆర్‌సీ 17’ని  సెట్స్‌కి తీసుకెళ్లనున్నారట రామ్‌చరణ్‌– సుకుమార్‌. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు? అనే విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.

సుకుమార్ దర్శకత్వంలో

అయితే రామ్‌చరణ్‌కి జోడీగా కృతీసనన్‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట సుకుమార్‌. మహేశ్‌ బాబు హీరోగా నటించిన ‘వన్‌: నేనొక్కడినే’ సినిమా ద్వారా కృతీసనన్‌ని తెలుగుకి పరిచయం చేశారు సుకుమార్‌. ఆ తర్వాత ‘దోచెయ్, ఆదిపురుష్‌’ వంటి తెలుగు సినిమాల్లో నటించారు కృతీసనన్‌. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీని ‘ఆర్‌సీ 17’ ద్వారా మరోసారి టాలీవుడ్‌కి తీసుకురానున్నారట సుకుమార్‌. మరి రామ్‌చరణ్‌కి జోడీగా కృతీసనన్‌ నటిస్తారా? లేదా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

‘ఆర్‌సీ 17’ చిత్రంలో కృతి సనన్ నటించే అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ చరణ్ అభిమానులు ఈ జోడీని చూడటానికి ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.