
📌 Key Points
- దర్శకుడిగా ‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’లతో వేణు ఉడుగుల గుర్తింపు పొందారు.
- సాయి పల్లవికి తాను ఎవరో తెలియదని పడిపడి లేచే మనసు ప్రమోషన్స్‌లో చెప్పిందని వేణు వెల్లడించారు.
- శర్వానంద్ సిఫార్సుతో సుధాకర్ చెరుకూరి ‘విరాట పర్వం’కు అడ్వాన్స్ ఇచ్చారు.
- ‘విరాట పర్వం’ కథను మొదట మలయాళ హీరో నివిన్ పౌలి ఓకే చేశాడని వేణు తెలిపారు.
దర్శకుడు వేణు ఉడుగుల తన కెరీర్, ‘విరాట పర్వం’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సాయి పల్లవి తన గురించి చేసిన వ్యాఖ్యలు, శర్వానంద్ మద్దతు, అలాగే రానా కంటే ముందు మరొక హీరో ‘విరాట పర్వం’ చేయాల్సిందనే నిజాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
సాయి పల్లవి ‘నేనెవరో తెలీదు’ అంది!
Venu Udugula : నీది నాది ఒకే కథ, విరాట పర్వం సినిమాలతో దర్శకుడిగా ఫేమ్ తెచ్చుకున్న వేణు ఉడుగుల ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో నిర్మాతగా హిట్ కొట్టారు. వేణు ఉడుగుల తాజాగా 10 టీవీకి ఇచ్చిన విరాట పర్వం సినిమా ఎలా ఓకే అయిందో చెప్తూ ఆసక్తికర విషయం తెలిపారు.(Venu Udugula)
శర్వానంద్ తో వేణు ఉడుగులకు లభించిన అవకాశం
వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ఫస్ట్ సినిమా హిట్ అయి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దాంతో చాలా మంది నిర్మాతలు ఫోన్స్ చేసారు, అవకాశాలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారు అంటే వుమెన్ సెంట్రిక్ చేయాలి, సాయి పల్లవి లాంటి అమ్మాయితో చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాను. అప్పటికి విరాట పర్వం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నా నెక్స్ట్ సినిమా సాయి పల్లవితో అని రాసేశారు వార్తల్లో. అది సాయి పల్లవి దాకా వెళ్ళింది.
ఆమెని పడిపడి లేచే మనసు సినిమా ప్రమోషన్స్ లో వేణు ఉడుగులతో సినిమా చేస్తున్నారట అని అడిగితే ఎవరు అతను, నాకు తెలీదు అని చెప్పింది. పక్కనే శర్వానంద్ ఉంటే ఇతను మంచి డైరెక్టర్ అని నా గురించి చెప్పాడు. అప్పుడే శర్వానంద్ సుధాకర్ చెరుకూరి గారికి చెప్పి అడ్వాన్స్ ఇప్పించారు. కథ చెప్పిన పది నిమిషాల్లో చెక్ ఇచ్చారు. వారం రోజుల్లో ఆఫీస్ ఓపెన్ చేసాము. ఇంకో వారం రోజుల్లో సాయి పల్లవితో మీటింగ్ ఇప్పిస్తే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసారు. మలయాళం హీరో నివిన్ పోలికి విరాట పర్వం కథ చెప్తే ఓకె చేసాడు. కానీ అనుకోకుండా సురేష్ బాబుకి కథ చెప్తే రానాకి చెప్పామన్నారు. దాంతో రానా ఓకే చేసాడు. అలా ఆ సినిమా రానాతో తెరకెక్కింది. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు అంటారు కానీ బ్రేక్ ఈవెన్ అయింది, సేల్ అయింది. డబ్బులు వచ్చాయి. కాకపోతే అనుకున్నంత విజయం సాధించలేదు అని ఫీల్ అయ్యాను అని తెలిపారు.
రానా ముందు ‘విరాట పర్వం’ చేయాల్సింది అతనే!
వేణు ఉడుగుల నిజాయితీగా చెప్పిన ఈ విషయాలు పరిశ్రమలో అవకాశాల కోసం పడే కష్టాన్ని, అనుకోని మలుపులను తెలియజేస్తున్నాయి. ‘విరాట పర్వం’ వెనుక ఇంత కథ ఉందన్నమాట.


