
📌 Key Points
- “పెద్ది” సినిమా జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
- వెంకట సతీష్ కిలారు ఈ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
- రామ్ చరణ్ కు జీవితాంతం రుణపడి ఉంటానని నిర్మాత భావోద్వేగంగా వెల్లడించారు.
- దర్శకుడు సుకుమార్ కు కూడా సతీష్ కిలారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న “పెద్ది” సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట సతీష్ కిలారు రామ్ చరణ్ పై భావోద్వేగం వ్యక్తం చేశారు. తన మొదటి సినిమాకు అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.
“పెద్ది” విడుదల తేదీ ఖరారు
Venkata Satish Kilaru: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమా విడుదల విషయంలో ఇన్ని రోజులు అభిమానులు అయోమయ పరిస్థితులలో ఉన్నారు. అయితే తాజాగా చిత్ర బృందం పెద్ది (Peddi)రిలీజ్ అనౌన్స్ ప్రెస్ మీట్ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ది సినిమా విడుదల తేదీని అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమా జూన్ 4వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయాన్ని చిత్ర బృందం తెలియచేశారు.
ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జూన్ 4వ తేదీ విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఇక తాజాగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru)మాట్లాడుతూ సినిమా గురించి రాంచరణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ పెద్ది సినిమా ద్వారా వెంకట సతీష్ కిలారు నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
రామ్ చరణ్ పై నిర్మాత భావోద్వేగం
రామ్ చరణ్(Ramcharan) తోనే మొదటి సినిమా చేసే అవకాశం రావడంతో ఈయన మాట్లాడుతూ తన ఏంటో తెలియకుండా రాంచరణ్ గారు నాకు ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఈ విషయంలో తాను రాంచరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు. ఇక పెద్ద సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చూడదగ్గ సినిమా అని కచ్చితంగా ప్రతి ఒక్కరిని పెద్ద ఆకట్టుకుంటుందని, పెద్ది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని తెలిపారు.
జూన్ 3న పెద్ది ప్రీమియర్స్..
సుకుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు
సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని డైరెక్టర్ బుచ్చిబాబు, రత్నవేల్ ,రామ్ చరణ్ సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లారని జూన్ 4వ తేదీ ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి సినిమాని చూసి ఆదరించండని ఈయన కోరారు. ఇక మూడో తేదీ ప్రీమియర్లు కూడా ప్రసారం కాబోతున్నాయని ఈ సందర్భంగా నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా విషయంలో తనని మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్న దర్శకుడు సుకుమార్ కు ఈ సందర్భంగా సతీష్ కిలారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక చివరిగా యాంకర్ మాట్లాడుతూ రామ్ చరణ్ గారితో మీకు ఒక మంచి మూమెంట్ ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు తాను రాంచరణ్ గారి ఇంటి భోజనమే తిన్నానని ప్రతిరోజు ఆయన ఇంటి నుంచి వచ్చే భోజనం నాకు డైరెక్టర్ కు పెట్టేవారు. ఇంతకన్నా ఒక మంచి మూమెంట్ ఇంకేది ఉండదు అంటూ రాంచరణ్ తో తనకున్నటువంటి బాండింగ్ గురించి కూడా వెంకట సతీష్ కిలారు అభిమానులతో పంచుకున్నారు.
మొత్తానికి, “పెద్ది” సినిమా విడుదల తేదీతో పాటు, నిర్మాత వెంకట సతీష్ కిలారు రామ్ చరణ్ పట్ల చూపిన కృతజ్ఞత సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

