
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఈస్ట్ గోదావరి హక్కులు భారీ ధరకు నాగ వంశీ సొంతం!
- తూర్పు గోదావరి జిల్లా హక్కులు ఏకంగా రూ. 13.20 కోట్లకు కొనుగోలు చేసిన నాగ వంశీ.
- ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ విడుదల, భారీ అంచనాలు నెలకొన్నాయి.
- జాన్వీ కపూర్ హీరోయిన్, బుచ్చిబాబు సన దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఈస్ట్ గోదావరి హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
నాగ వంశీ చేతికి ‘పెద్ది’ తూర్పు గోదావరి హక్కులు!
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు. దీనిని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను కూడా అమ్మి వేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈస్ట్ గోదావరి హక్కులకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.
భారీ ధరకు అమ్ముడుపోయిన ‘పెద్ది’ మూవీ రైట్స్
తెలుగు చిత్ర సీమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా గుర్తింపును సంపాదించుకున్న నాగ వంశీ ‘పెద్ది’ యొక్క ఈస్ట్ గోదావరి హక్కులను దక్కించుకున్నట్లు, ఈయన ఏకంగా 13.20 కోట్ల భారీ ధరకు ఈస్ట్ గోదావరి హక్కులను కైవసం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. కేవలం ఒక్క ఏరియాకి ఇంత పెట్టి కొనుగోలు చేయడంతో ఈ డిస్ట్రిబ్యూటర్ చాలా పెద్ద మొత్తంలో రిస్క్ చేస్తున్నాడని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది పెద్ది చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి, కచ్చితంగా విజయాన్ని సాధించే లక్షణాలు కనబడుతున్నాయి.
‘పెద్ది’ చిత్రంపై అంచనాలు.. హిట్ అవుతుందా?
మంచి టాక్ వస్తే ఈ సినిమా ద్వారా ఈ నిర్మాతకు మంచి లాభాలు వస్తాయని అభిప్రాయాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాంధు తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


