
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో ఊహించని ట్విస్ట్: క్రికెటర్ పాత్ర కాదట!
- బుచ్చిబాబు దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ‘పెద్ది’ చిత్రం!
- 300 కోట్ల భారీ బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ నిర్మాణంలో ‘పెద్ది’ మూవీ!
- ఏప్రిల్ 30న విడుదల కానున్న ‘పెద్ది’: రామ్ చరణ్ మాస్ లుక్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్ కాదట! అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
రామ్ చరణ్ క్రికెటర్ కాదా? అసలు నిజం ఏమిటి?
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. వృద్ధి సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని ఏకంగా 300 కోట్లకు పైగా బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆల్రెడీ పాజిటివ్ బజ్ నెలకొంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ కి దద్దరిల్లే రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో రాంచరణ్ విలేజ్ క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. ప్రతి పోస్టర్, టీజర్, సాంగ్ లో రాంచరణ్ బ్యాట్ పట్టుకుని ఉన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనితో ఈ మూవీలో క్రికెట్ కి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి అని అభిమానులు భావిస్తున్నారు.
‘పెద్ది’ మూవీలో క్రీడల వెనుక దాగున్న కథేంటి?
ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా క్రికెట్ ప్రధానంగా తెరకెక్కుతోంది అని భావిస్తున్న అభిమానులకు బిగ్ ట్విస్ట్. అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీలో ప్రధానంగా ఉండే కథాంశం క్రికెట్ కాదు అని తెలుస్తోంది. అసలు రాంచరణ్ ఈ మూవీలో క్రికెటర్ కాదట.
ఈ చిత్రం కథాంశంలో క్రీడలు అనేవి ఒక భాగం మాత్రమే అని అంటున్నారు. రాంచరణ్ డబ్బు సంపాదించడం కోసం వివిధ రకాల క్రీడలు ఆడుతుంటాడు. అందులో క్రికెట్, కుస్తీ లాంటి క్రీడలు ఉన్నాయి. క్రీడలకు మించిన కథాంశం వేరే ఉంది అని అంటున్నారు.
బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సెన్సేషనల్ హిట్!
ఈ మూవీలో ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉండేలా బుచ్చిబాబు రూపొందిస్తున్నారు. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది అని అంటున్నారు. మరి క్రీడలు కాకుండా బుచ్చిబాబు దాచిపెట్టిన అంశాలు ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాలి.
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ గురించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


