
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నెట్‌ఫ్లిక్స్ చేతికి – భారీ ధరకు కొనుగోలు!
- మార్చి 27న ‘పెద్ది’ విడుదల – క్రికెట్ నేపధ్యంలో చిత్రం!
- రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మెరుపులు!
- శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో అదరగొట్టనున్నారు, ఏ ఆర్ రెహమాన్ సంగీతం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ లో ‘పెద్ది’ హవా: భారీ మొత్తం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలు అడుగుపెట్టిన రామ్ చరణ్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మగధీర, RRR లాంటి బడా సినిమాలు చేసి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కూడా అవతారం ఎత్తారు. అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హిట్ లేక సతమతమవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరుస్తున్నారు. ప్రకాష్ రాజ్, జగపతిబాబు లాంటివారు ప్రత్యేక పాత్రలో మెరువనున్నట్లు టాక్. క్రికెట్ నేపద్యంలో వస్తున్న పెద్ది సినిమా మార్చి 27వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ గురించి తాజాగా అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 130 కోట్లు పెట్టి మరి ఈ సినిమాను కొనుగోలు చేసిందట నెట్ ఫ్లిక్స్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
జాన్వీ కపూర్ తో రామ్ చరణ్ జోడీ: ఎలా ఉండబోతుంది?
మార్చి 27న విడుదల: క్రికెట్ నేపధ్యం!
‘పెద్ది’ సినిమా ఓటీటీ హక్కుల గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ కెరీర్ లో ఇది ఒక మైలురాయి అవుతుందా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


