|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ: ఓవర్సీస్‌లో టికెట్ల మోత.. ధరలు వింటే షాకే!

Published: 26-03-2026, 2:05 AM
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ: ఓవర్సీస్‌లో టికెట్ల మోత.. ధరలు వింటే షాకే!
  • రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ‘పెద్ది’ చిత్రం
  • ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి
  • ప్రీమియర్ షో టికెట్ ధర 35 డాలర్లు
  • మార్చి 27న టీజర్ విడుదల

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం విడుదలకు ముందే ఓవర్సీస్‌లో టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. టికెట్ ధరలు భారీగా ఉండటం విశేషం. రేపు టీజర్ విడుదల కానుంది.

ఓవర్సీస్‌లో ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

Peddi Movie:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ సినిమాతో ఓవర్ నైట్ లోనే డైరెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Bucchibabu Sana) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘పెద్ది’. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా మార్చి 27వ తేదీన అనగా రేపు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. టికెట్ ధరల పెంపు, మిగతా చిత్రీకరణ పనుల కారణంగా సినిమాను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే అప్పుడే ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అక్కడ ఒక్కో టికెట్ ధర తెలిస్తే నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

అసలు విషయంలోకి వెళ్తే .. ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈనెల 27ని ప్రారంభం కాబోతున్నాయి.. ముఖ్యంగా రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ రేపటి నుండే ఓవర్సీస్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మొదలుపెడితే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు. ఇక అందులో భాగంగానే రేపటి నుంచి ఈ సినిమా టికెట్స్ ఓవర్సీస్ లో అందుబాటులో ఉండనున్నాయి. సినిమా టికెట్ రేటు ధర విషయానికి వస్తే.. ప్రీమియర్ షోకి ఐమాక్స్ ఫార్మాట్, దిబాక్స్ స్క్రీన్స్ కి 35 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల 3,281 రూపాయలు.. అలాగే XD/PLF ఫార్మాట్ స్క్రీన్స్ కి 30 డాలర్ల టికెట్ రేటు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2,812 రూపాయలు అన్నమాట. అలాగే స్టాండర్డ్ ఫార్మాట్ స్క్రీన్ కి టికెట్ రేటును 25 డాలర్లు(2,343 రూపాయలు)గా విక్రయించబోతున్నారు.

టికెట్ ధరలు ఎంతో తెలుసా?

ఇకపోతే ఈ సినిమాకి మంచి హైప్ కూడా ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండే మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ ను రాబడుతుందని అటు మేకర్స్ కూడా బలమైన నమ్మకంతో ఉన్నారు. నార్త్ అమెరికాలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవాలి అంటే ఏడు మిలియన్ డాలర్ల గ్రాస్ ను ఫుల్ రన్ లోనే రాబట్టాలి. మరి ఆ రేంజ్ గ్రాస్ ను ఈ చిత్రం రాబడుతుందా లేదా అనే ఆసక్తి కూడా ఇప్పుడు ఆడియన్స్లో నెలకొంది.

టీజర్ విడుదల ఎప్పుడంటే?

ఇదిలా ఉండగా రేపు అనగా 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు ఈ సినిమా నుండి టీజర్ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అటు విడుదల చేసిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే గ్లింప్స్ వీడియో కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లభించింది. మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాతో మరిన్ని రికార్డులు బ్రేక్ చేయాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

‘పెద్ది’ చిత్రం ఓవర్సీస్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ప్రీమియర్ షోల ద్వారానే మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. రేపు టీజర్ విడుదల కాబోతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.