|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల వాయిదా! ఫ్యాన్స్ నిరాశ! కొత్త తేదీ ఎప్పుడో?

Published: 30-03-2026, 9:35 AM
రామ్ చరణ్ 'పెద్ది' విడుదల వాయిదా! ఫ్యాన్స్ నిరాశ! కొత్త తేదీ ఎప్పుడో?
  • రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల తేదీ మళ్ళీ వాయిదా.
  • ఏప్రిల్ 30 నుండి జూన్ 5కి విడుదల వాయిదా పడే అవకాశం.
  • వేసవి సెలవులు అయ్యాక సినిమా విడుదలపై అభిమానుల సందేహాలు.
  • సినిమా ఆలస్యం కావడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్న మెగా అభిమానులు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 5కి వాయిదా పడే అవకాశం ఉంది. దీనితో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

మళ్ళీ వాయిదా పడిన ‘పెద్ది’ విడుదల

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా (Peddi Movie)విషయంలో అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తున్న నేపథ్యంలో విడుదల కూడా వాయిదా పడుతూ వస్తోంది.

మార్చి 27వ తేదీ విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా పడుతూ ఏప్రిల్ 30వ తేదీ విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ కూడా రావడంలేదని మరోసారి వాయిదా పడుతుందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఈ సినిమా జూన్ 5వ తేదీకి వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ సినిమాని జూన్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్నికి సంబంధించి అధికారక ప్రకటన కూడా తెలియచేయబోతున్నారు.

జూన్ 5న విడుదల కానుందా?

ఇక జూన్ 5వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ వస్తున్న వార్తలపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఆ సమయానికి వేసవి సెలవులు పూర్తి అవుతాయి అలాగే వర్షాలు కూడా పడుతుంటాయి. ఇలా అధిక వర్షాల సమయంలో ఈ సినిమాని విడుదల చేయడం ఎంతవరకు సమంజసం అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇలా తరచూ ఈ సినిమా వాయిదా పడుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో రామ్ చరణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకొని చాలాకాలం అయింది. ఈ నేపథ్యంలోనే పెద్ది సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సోషల్ మీడియా ట్రెండింగ్ లో పహిల్వాన్ గ్లింప్స్ ..

నిరాశలో మెగా అభిమానులు

ఇక ఈ సినిమా షూటింగ్ ఒక వారంలో పూర్తి కానుంది అయితే ఎలాంటి హడావిడి లేకుండా మంచి క్వాలిటీతో సినిమాని ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా వాయిదా వేసుకుంటున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా తరుచూ వాయిదా పడటంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు జగపతిబాబు, శివ రాజ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పహిల్వాన్ గ్లింప్స్ విడుదల చేయగా అద్భుతమైన ఆదరణ లభించడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.

‘పెద్ది’ సినిమా విడుదల పదే పదే వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. జూన్ 5న సినిమా విడుదలవుతుందో లేదో వేచి చూడాలి. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ఒక మైలురాయి అవుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.