
📌 Key Points
- జపాన్ ‘అనాన్’ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన ప్రభాస్ – ఫస్ట్ ఇండియన్ సోలో హీరోగా రికార్డ్!
- ‘బాహుబలి’ సినిమాతో జపాన్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన డార్లింగ్ ప్రభాస్.
- గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి కవర్ పేజీపై కనిపించగా, ఇప్పుడు ప్రభాస్ ఒక్కడే!
- ప్రభాస్‌కు జపాన్‌లో ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ‘అనాన్’ మ్యాగజైన్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన సత్తా చాటాడు. జపాన్‌లోని ప్రతిష్టాత్మక ‘అనాన్’ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన మొదటి భారతీయ సోలో హీరోగా రికార్డు సృష్టించాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జపాన్‌లో ప్రభాస్ క్రేజ్ చూస్తే షాక్ అవుతారు!
దక్షిణాది సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, అక్కడ ఒక భారతీయ నటుడికి దక్కుతున్న గౌరవం చూస్తుంటే ప్రభాస్(Prabhas) క్రేజ్ ఏ రేంజ్‌కు చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ సినిమాతో జపనీస్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రభాస్ అరుదైన ఘనత సాధించారు. జపాన్‌కు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ ‘అనాన్’ (Anan) కవర్ పేజీపై ప్రభాస్ దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాగజైన్ కవర్‌పై సోలోగా కనిపించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు.
గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించగా, ఇప్పుడు ప్రభాస్ ఒంటరిగా ఆ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ నెల 10 విడుదల కానున్న ఆ మ్యాగజైన్‌లో ప్రభాస్’కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ముఖ్యంగా జపాన్ ప్రేక్షకుల్లో ఆయనకు ఏర్పడిని అభిమానాన్ని అందులో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మ్యాగజైన్ కవర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రభాస్ అభిమానులు “అదీ డార్లింగ్ రేంజ్” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ సాధిస్తున్న ఈ వరుస విజయాలు భారతీయ సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటుతున్నాయి.
‘అనాన్’ మ్యాగజైన్‌పై సోలోగా ప్రభాస్ రికార్డ్
ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
ప్రభాస్ జపాన్‌లో కూడా తన క్రేజ్‌ను నిలుపుకున్నాడు. ఈ విజయం భారతీయ సినిమాకు గర్వకారణం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


