|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ వెనుక షాకింగ్ సీక్రెట్స్! ముగ్గురు స్టార్ హీరోలు ఎందుకు నో చెప్పారో తెలుసా?

Published: 18-03-2026, 3:35 AM
రామ్ చరణ్ 'పెద్ది' వెనుక షాకింగ్ సీక్రెట్స్! ముగ్గురు స్టార్ హీరోలు ఎందుకు నో చెప్పారో తెలుసా?
  • జూనియర్ ఎన్టీఆర్ భారీ ప్రాజెక్టుల వల్ల ‘పెద్ది’ సినిమాను వదులుకున్నారు – అభిమానులకు నిరాశ!
  • అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉండటం వలన ‘పెద్ది’ కథను పట్టించుకోలేదట – మరో ఛాన్స్ మిస్!
  • సూర్య కథలో మార్పులు కోరడంతో బుచ్చిబాబు తిరస్కరించారు – అందుకే చరణ్ లైన్ లోకి వచ్చాడు!
  • సుకుమార్ సలహాతో రామ్ చరణ్ ‘పెద్ది’కి గ్రీన్ సిగ్నల్ – మెగా ఫ్యాన్స్‌కు పండగే!

టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా! ఈ సినిమాను ముగ్గురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేయడానికి గల కారణాలు తెలిస్తే షాక్ అవుతారు. చరణ్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

ఎన్టీఆర్ నో చెప్పడానికి కారణం ఏంటి?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీర్ అయినా.. అన్ని సినిమాలు చేయాలి అని లేదు.. కొన్ని కారణాల వల్ల వదులుకున్న సినిమాలు వేరే హీరోల దగ్గరకు వెళ్లి హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్క సినిమాను పలువురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.

అలా ముగ్గరు స్టార్ హీరోలు మిస్ అయిన కథతో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే పెద్ది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. ఈసినిమాను స్టార్ హీరోలు ఎందుకు వద్దనుకున్నారు? చరణ్ ఏ నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇంతకీ ఈ సినిమా వద్దనుకున్న ముగ్గరు ఎవరు?

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రామ్ చరణ్‌కు ముందే పెద్ది కథను బుచ్చిబాబు ముగ్గురు స్టార్ హీరోలకు వినిపించినట్లు సమాచారం. ఫస్ట్ ఈ కథతో జూనియర్ ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లాడట తారక్.. ఆయనకు కథ చెప్పగా.. ఈసినిమా, పాత్రలు, కథలో ఉన్న వేరియేషన్స్ ఆయనకు నచ్చినప్పటికీ, అప్పటికే పెద్ద ప్రాజెక్టులకు కమిట్ అవ్వడంతో.. ఈ సినిమాను తారక్ వదిలేసుకున్నారట. లేకుంటే ఎన్టీఆర్ ఈ సినిమాను చేసేవాడు.. అని అంటున్నారు. పెద్ది లుక్ లో తారక్ ఎలా ఉండేవాడో?

అల్లు అర్జున్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా?

తర్వాత ఈ కథను అల్లు అర్జున్‌కు వినిపించాడట బుచ్చిబాబు. ఆయన కూడా అప్పటికే పుష్ప బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. అందులోనే పాన్ఇండియా స్థాయిలో పెద్ద సినిమాలు చేయాలని ప్లాన్ లో ఉన్న చరణ్ ఈ సినిమాపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయాడు.

అల్లు అర్జున్ కాదనడంతో.. తమిళ హీరోలను కూడా ట్రై చేశాడు బుచ్చిబాబు.. స్టార్ హీరో సూర్యకు కూడా ఈ కథ చెప్పినట్లు సమాచారం. అయితే సూర్య ఈ కథలో కొన్ని మార్పులు సూచించడంతో, బుచ్చిబాబు ఆ మార్పులను అంగీకరించకుండా ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

చరణ్ ‘పెద్ది’తో రికార్డులు కొడతాడా?

ఆ తరువాత దర్శకుడు సుకుమార్ సహాయంతో ఈ కథను రామ్ చరణ్ దగ్గరకు తీసుకెళ్లారు. కథ విన్న రామ్ చరణ్‌తో పాటు చిరంజీవికి కూడా ఈ కథ బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపారు. సుకుమార్‌పై ఉన్న నమ్మకంతో పాటు బుచ్చిబాబు ప్రతిభపై విశ్వాసంతో రామ్ చరణ్ ఈ సినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం.ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ నమ్మకాన్ని బుచ్చిబాబు అండ్ టీమ్ నిలబెడతారా లేదా అన్నది సినిమా విడుదలైన తరువాతే తెలియనుంది.

ఒక సినిమా విజయవంతం కావడం పూర్తిగా దర్శకుడి దృష్టి, ఆలోచన అండ్ టీమ్‌ను ఎలా వినియోగించుకుంటాడనే విషయంపై ఆధారపడి ఉంటుంది. దర్శకుడు తన టీమ్‌ను సరిగ్గా ఉపయోగిస్తేనే మంచి అవుట్‌పుట్ వస్తుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు తన మొదటి చిత్రం ‘ఉప్పెన’తో భారీ విజయాన్ని సాధించి ఒక్కసారిగా టాప్ దర్శకుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు.‘ఉప్పెన’ అందించిన సక్సెస్‌తో బుచ్చిబాబు పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆయన ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాత ఎన్నిరికార్డులు కొల్ల గొడతాడో చూడాలి.

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బుచ్చిబాబు ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.