|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా ఫ్యాన్స్‌కి బిగ్ షాక్! ‘పెద్ది’ రిలీజ్ పై ఊహించని ట్విస్ట్! ఫైనల్ డేట్ ఇదేనా?

Published: 01-05-2026, 11:19 AM
మెగా ఫ్యాన్స్‌కి బిగ్ షాక్! 'పెద్ది' రిలీజ్ పై ఊహించని ట్విస్ట్! ఫైనల్ డేట్ ఇదేనా?
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై సంచలన ప్రకటన. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల.
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామా. షూటింగ్ పూర్తి, పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా సాగుతోంది.
  • ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్పెషల్ సాంగ్ హైలైట్. చరణ్ పహిల్వాన్ లుక్ కు భారీ రెస్పాన్స్.
  • జాన్వీ కపూర్ హీరోయిన్. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై బిగ్ అప్‌డేట్ వచ్చేసింది! అనేక ట్విస్టులు, వాయిదాల తర్వాత, చివరకు మూవీ టీమ్ ఓ సాలిడ్ డేట్‌ను లాక్ చేసింది. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

వాయిదాల పరంపరకు తెరపడిందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫైనల్ రిలీజ్ డేట్ ను.. మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి పెద్ది సినిమా విడుదలవుతున్నట్టు ప్రకటించి.. ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసింది బుచ్చిబాబు టీమ్.

ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది పెద్ది. 2026 పొంగల్ కు రిలీజ్ అవుతుంది అనుకుంటే.. సమ్మర్ కు పోస్ట్ పోన్ అయ్యింది. అప్పటికీ షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో.. సమ్మర్ బరి నుంచి కూడా తప్పుకుని జూన్ 25న ఈసినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారట చరణ్ టీమ్. కానీ ఈలోపు 4న రిలీజ్ కావల్సిన టాక్సిక్ పోస్ట్ పోన్ అవ్వడంతో.. ఈ డేట్ ను పెద్ది టీమ్ లాక్ చేసుకున్నారు. సమ్మర్ హాలిడేస్ చివరి దశలో ఉండటం.. స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ అవ్వడానికి ముందు.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనాతో ఈ డేట్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

జూన్ 4న ‘పెద్ది’ ధూమ్ ధామ్ పక్కా!

హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఒక అద్భుతమైన స్పెషల్ సాంగ్ షూట్ ను మూవీ టీమ్ పూర్తి చేయడంతో.. అధికారికంగా ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. ఈ ఎనర్జిటిక్ సాంగ్ ‘పెద్ది’ చిత్రంలోని మెయిన్ హైలెట్స్ లో ఒకటిగా నిలవనుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ గా సాగుతున్నాయి.ఈ నెలలో ఫైనల్ వర్క్ కంప్లీట్ చేస్తూనే.. ప్రమోసన్స్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్ది నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా పహిల్వాన్ గా రామ్ చరణ్ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోయారు.

చరణ్ ‘పెద్ది’పై భారీ అంచనాలు!

ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, సీనియర్ నటులు శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌ అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కూడిన రూరల్ స్పోర్ట్స్ కథతో రూపొందిన ‘పెద్ది’ హిందీతో పాటు అన్ని దక్షిణ భారత భాషలలో పాన్-ఇండియా స్థాయిలో ఘనంగా విడుదల కానుంది.

‘పెద్ది’ రిలీజ్ పై వచ్చిన ఈ లేటెస్ట్ అప్‌డేట్ తో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. జూన్ 4న బాక్సాఫీస్ వద్ద చరణ్ విధ్వంసం చూడటానికి సిద్ధంగా ఉండండి. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.