
📌 Key Points
- రామ్ చరణ్ తన పెట్ డాగ్ రైమ్, క్లిన్ కారాను కాపాడుతుందని చెప్పారు.
- రైమ్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు కారా వెళ్లకుండా అడ్డుకుంటుందని చరణ్ వెల్లడించారు.
- గతంలో ఉపాసన రైమ్, కారా మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పారు.
- చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు కూడా ఉన్నారు, శివ రామ్, అన్విరా దేవి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెట్ డాగ్ రైమ్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రైమ్ తన కుమార్తె క్లిన్ కారాని సొంత బిడ్డలా కాపాడుతుందని, ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటుందని చరణ్ తెలిపారు.
రైమ్ గురించి రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఎస్వైర్ ఇండియా(Esquire India)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే వృత్తిపరమైన అంశాల గురించి ప్రస్తావించారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా రామ్ చరణ్ (Ramcharan)తన పెట్ డాగ్ రైమ్(Rhyme) గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. రైమ్ అంటే రామ్ చరణ్ ఉపాసనకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడికి వెళ్లిన ఈ జంట వారితో పాటు రైమ్ ను కూడా వెంట తీసుకెళ్తూ ఉంటారు.
ఇక ఇటీవల చరణ్ ఎస్వైర్ మ్యాగజైన్ కవర్ పేజీపై రైమ్ తో ఉన్న ఫోటోని విడుదల చేశారు అలాగే మేడం టుసాడ్స్ లో ఏర్పాటుచేసిన రామ్ చరణ్ మైనపు విగ్రహంతో పాటు రైమ్ బొమ్మను కూడా ఏర్పాటు చేయడంతో రైమ్ కు కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇంటర్వ్యూ సందర్భంగా చరణ్ రైమ్ గురించి మాట్లాడుతూ..రైమ్ తన కుమార్తె క్లిన్ కారా (Klinkaara) పట్ల చాలా అప్రమత్తంగా ఉంటుందని తనని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కారా స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటుంది కానీ రైమ్ మాత్రం తనను స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటుందని, ఈ విషయాన్ని తాను చాలా సార్లు గమనించాను అంటూ చరణ్ తెలిపారు.
క్లిన్ కారాని కాపాడుతున్న రైమ్
రైమ్ పరిస్థితులను పసిగడుతూ ఎంతో అప్రమత్తంగా ఉంటుందని అందుకే దానికి కావలసినంత స్వేచ్ఛను కల్పిస్తూ ఉంటామని ఈ సందర్భంగా తన పెట్ డాగ్ రైమ్ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైమ్ క్లిన్ కారా పుట్టిన సమయంలో ఊయలలో పడుకుంటే అక్కడే కాపలా కాస్తూ ఉండేదని ఉపాసన గతంలో కూడా వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలియజేశారు. ఇలా రైమ్ క్లిన్ కారా మధ్య ఉన్న బాండింగ్ గురించి చరణ్ చెప్పడంతో అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక చరణ్ చేసిన ఈ వ్యాఖ్యల పై విభిన్న రీతిలో స్పందిస్తూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
పెద్ది పనులలో బిజీగా చరణ్..
చరణ్, ఉపాసన దంపతుల ముగ్గురు పిల్లలు
రామ్ చరణ్ ఉపాసన విషయానికి వస్తే ఈ దంపతులకు ముగ్గురు సంతానం అనే సంగతి తెలిసిందే. పెళ్లయిన పది సంవత్సరాలకు ఈ దంపతులు మొదటి బిడ్డ క్లిన్ కారాకు జన్మనిచ్చారు. ఇక ఈ చిన్నారి జన్మించిన రెండు సంవత్సరాలకు ఉపాసన మరోసారి కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈమె జనవరి 31వ తేదీ శివ రామ్ కొణిదెల అనే అబ్బాయితో పాటు అన్విరా దేవి అనే అమ్మాయికి జన్మనిచ్చారు. ఇక వీరిద్దరూ చిన్నవాళ్లు కావడంతో రైమ్, కారా మధ్య మంచి బాండింగ్ ఉందని చరణ్ ఉపాసన దంపతులు తెలియజేశారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పెద్ది సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
రైమ్, క్లిన్ కారా మధ్య అనుబంధం గురించి చరణ్ చెప్పిన విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి మురిసిపోతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


