
📌 Key Points
- రామ్ చరణ్ ‘ధురంధర్ 2’ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు హర్ట్.
- రణవీర్ సింగ్ నటనను రామ్ చరణ్ ప్రత్యేకంగా కొనియాడారు.
- దర్శకుడు ఆదిత్య ధర్ ఎమోషన్స్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేశారని చరణ్ అన్నారు.
- రామ్ చరణ్ ట్వీట్‌కు ఆదిత్య ధర్ రీ ట్వీట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమాను పట్టించుకోకుండా బాలీవుడ్ సినిమాను పొగడటంతో మెగా అభిమానులు హర్ట్ అవుతున్నారు. ‘ధురంధర్ 2’ సినిమాపై చరణ్ ప్రశంసలు కురిపించడంతో ఈ వివాదం మొదలైంది.
రామ్ చరణ్ ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్ హర్ట్
Ram Charan: బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాను వదిలేసి, పోటీగా వచ్చిన ‘ధురంధర్ 2’పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ కాస్త హర్టవుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి వారంతా ‘ధురంధర్ 2’పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్స్ వేశారు. కానీ, పవన్ కళ్యాణ్ సినిమాపై ఎవరూ మాట్లడలేదు సరికదా.. కనీసం ఓ ట్వీట్ కూడా వేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ బాగా హర్టవుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే పని చేయడంతో.. వారి బాధ ఇక వర్ణనాతీతం. సరే రామ్ చరణ్ ట్వీట్ విషయానికి వస్తే.. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar The Revenge) బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.
తాజాగా ఈ సినిమాను చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిత్ర యూనిట్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చాలా ‘రా’ గా, గ్రిప్పింగ్‌గా, ఇంపాక్ట్ ఫుల్‌గా ఉందంటూ ఆయన కొనియాడారు. ఈ చిత్రంలో బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటనపై చరణ్ ప్రత్యేకంగా స్పందించారు. రణవీర్ తన ఇంటెన్సిటీతో సినిమా మొత్తాన్ని భుజాన వేసుకున్నాడు, అతని పర్ఫార్మెన్స్ ఫెనామినల్’ అని పేర్కొన్నారు. అలాగే వెటరన్ యాక్టర్స్ ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పరిణతి చెందిన నటనతో సినిమాకు వెన్నెముకగా నిలిచారని, సారా అర్జున్ తన పాత్రలో అద్భుతంగా నటించిందని చరణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆదిత్య ధర్ ఎమోషన్‌ను, స్కేల్‌ను చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. భారతీయ సినిమాలో ఇదొక ఉత్కంఠభరితమైన చిత్రమని, శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెబుతూ, జియో స్టూడియోస్, జ్యోతి దేశ్ పాండేను అభినందించారు.
‘ధురంధర్ 2’పై రామ్ చరణ్ ప్రశంసలు
ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా, ఈ ట్వీట్‌కు దర్శకుడు ఆదిత్య ధర్ రీ ట్వీట్ చేస్తూ, తన సంతోషాన్ని తెలియజేశారు. ‘‘థాంక్యూ బ్రదర్! మీ నుంచి ఇలాంటి ప్రశంస రావడం నాకు నిజంగా చాలా పెద్ద విషయం. మేము ఒక కథను పూర్తి నిజాయితీతో (కాస్త పిచ్చితో కలిపి) చెప్పడానికి ప్రయత్నించాం. అది మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ‘పెద్ది’ సినిమా కోసం మీరు సృష్టించబోయే సునామీని చూడటానికి నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఆ సినిమాకు, మీకు ఘనవిజయం లభించాలని కోరుకుంటున్నాను’’ అని ఆదిత్య ధర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా, ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం మొదలు పెట్టారు. మరోవైపు ‘ధురంధర్ 2’పై మన తెలుగు హీరోలు తప్పితే.. బాలీవుడ్‌లో మాత్రం ఎలాంటి స్పందనా లేదు. అక్కడి నటులెవరూ ఈ సినిమాపై స్పందించకపోవడం విశేషం.
Thank you, brother ❤️ Coming from you, this truly means a lot. We just tried to tell a story with honesty (and a little madness 😄). Glad it resonated with you! Wishing you all the power and success for Peddi. Can’t wait to witness the storm you’re about to create. 🤗🔥
రణవీర్ సింగ్‌పై చరణ్ ప్రత్యేక వ్యాఖ్యలు
— Aditya Dhar (@AdityaDharFilms) March 20, 2026
మొత్తానికి రామ్ చరణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ వివరణ ఇస్తారో లేదో చూడాలి.


